CM KCR: కేసీఆర్ పై ‘నువ్వు కావాలయ్యా పేరడీ సాంగ్’.. కాంగ్రెస్ మార్క్ సెటైర్!

కాంగ్రెస్‌ పార్టీ ప్రచారంలో ఈసారి వినూత్నంగా ప్రకటనలు ఇస్తోంది. వైవిధ్యంగా ఆలోచిస్తోంది. తాజగా జైలర్‌ లో తమన్నా ఐటెం సాంగ్‌ ’నువ్వు కావాలయ్యా’కు పేరడీని రూపొందించింది.

  • Written By: Raj Shekar
  • Published On:
CM KCR: కేసీఆర్ పై ‘నువ్వు కావాలయ్యా పేరడీ సాంగ్’.. కాంగ్రెస్ మార్క్ సెటైర్!

CM KCR: ‘నడువు నడువు నడవవే రామకా… కలిసి నడువు నడువవే రామక్క’.. «‘‘ఔర్‌ ఏక్‌ దక్కా కేసీఆర్‌ పక్కా.. తొడగొట్టి చెప్పుతున్న ఎవడొస్తడొ రండిర బై.. దేఖ్లేంగే’’ పాటలు బీఆర్‌ఎస్‌ ప్రచారానికి ఊపు తెస్తున్నాయి. మరోవైపు బలం ఆర్టిస్టులతో రూపొందించిన ప్రచార ప్రకటనలు టీవీల్లో హోరెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ కూడా బీఆర్‌ఎస్‌కు దీటుగా ప్రకటనలు రూపందించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోంది. చాలా మంది కాంగ్రెస్‌ ప్రకటలు, బీఆర్‌ఎస్‌ ప్రకటనలను పోల్చి చూసుకుంటున్నారు. రెండూ మూడు రోజులుగా బీజేపీ కూడా టీవీల్లో ప్రకటనలు ఇస్తోంది. మరోవైపు అన్ని పార్టీలు పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ అత్యధికంగా ప్రకటనలు ఇస్తుండగా, రెండో స్థానంలో బీజేపీ ఉంది. కాంగ్రెస్‌ ఇంకా పత్రికా ప్రకటనలు ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా జైలర్‌ పాటకు పేరడీగా బీఆర్‌ఎస్‌ వైఫల్యాలను వివరిస్తూ తీసిన ఓ పాటను ఆ పార్టీ సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. ఇప్పుడు ఈ పాట నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ఆకట్టుకునేలా కుటుంబ పాటల, ప్రభుత్వ వైఫల్యాలు, మళ్లీ గెలిస్తే జరిగే నష్టాన్ని ఈ పేరడీ పాటలో వివరించింది కాంగ్రెస్‌.

పేరడీ పాట ఇలా..
కాంగ్రెస్‌ పార్టీ ప్రచారంలో ఈసారి వినూత్నంగా ప్రకటనలు ఇస్తోంది. వైవిధ్యంగా ఆలోచిస్తోంది. తాజగా జైలర్‌ లో తమన్నా ఐటెం సాంగ్‌ ’నువ్వు కావాలయ్యా’కు పేరడీని రూపొందించింది. ‘ఏయ్‌ కేసీఆర్‌ తాతయ్యా.. కేటీఆర్‌ మామయ్యా.. ఏయ్‌ కల్వకుంట్ల అక్యయా.. కారు గుర్తు వద్దయ్యా.. సాలులే నీమాయా.. మోసమే నీఛాయా.. హస్తమే మేలయ్యా.. హుయ్యా.. హుయ్యా.. యా.. పో.. నువ్వు పోవాలయ్యా.. నువ్వు పోవాలయ్యా.. పో.. పో.. పో..’ అంటూ ఈ పేరడీ సాంగ్‌ సాగింది.

నెట్టింట్లో వైరల్‌..
జైలర్‌ పేరడీ సాంగ్‌ను కాంగ్రెస్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా, ఇప్పుడు నెట్టింట్లో చెక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. సాంగ్‌ సూపర్‌ అని కొందరు.. పో.. పో.. పోవాలయ్యా అని కొందరు.. మళ్లీ వస్తే తెలంగాణ ఆగమే.. గెలిపిస్తే తెలంగాణను అమ్మేస్తడు.. కేసీఆర్‌ను ప్రతిపక్ష నేతగా చూడాలి అని మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు. రిలీజ్‌ చేసిన నిమిషాల వ్యవధిలోనే వేలల్లో వ్యూస్, లైక్స్‌ రావడం గమనార్హం.

Read Today's Latest Telangana politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు