Koratala Siva- NTR: ఎన్టీఆర్ కొడుకు పేరే టైటిల్ గా పెట్టేసిన కొరటాల శివ.. షాక్ లో ఫ్యాన్స్
Koratala Siva- NTR: #RRR వంటి పాన్ వరల్డ్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఏడాది పాటుగా ఖాళీగా ఉండడం అభిమానుల సహనానికి పరీక్ష పెట్టేలా చేసింది..కొరటాల శివ తో సినిమా ఎప్పుడో ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు కనీసం పూజ కార్యక్రమాలు కూడా చెయ్యకపోవడం,మరో పక్క #RRR లో నటించిన మరో హీరో రామ్ చరణ్ శంకర్ తో సినిమా చేసి దాదాపుగా చివరి దసకి చేరుకోవడం, బుచ్చి బాబు – […]


Koratala Siva- NTR
Koratala Siva- NTR: #RRR వంటి పాన్ వరల్డ్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఏడాది పాటుగా ఖాళీగా ఉండడం అభిమానుల సహనానికి పరీక్ష పెట్టేలా చేసింది..కొరటాల శివ తో సినిమా ఎప్పుడో ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు కనీసం పూజ కార్యక్రమాలు కూడా చెయ్యకపోవడం,మరో పక్క #RRR లో నటించిన మరో హీరో రామ్ చరణ్ శంకర్ తో సినిమా చేసి దాదాపుగా చివరి దసకి చేరుకోవడం, బుచ్చి బాబు – ఎన్టీఆర్ కాంబినేషన్ లో రావాల్సిన సినిమా కూడా రామ్ చరణ్ కి వెళ్లిపోవడం వంటివి నందమూరి ఫ్యాన్స్ ని కాస్త అసహనంకి గురించి చేసింది.
అయితే అమిగోస్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఎన్టీఆర్ ఫిబ్రవరి నెలలో ముహూర్తం మరియు మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అన్ని అధికారికంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

Koratala Siva- NTR
ఈ నెల 24 వ తారీఖున ముహూర్తం జరుపుకోనున్న ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ కూడా బయటకి వచ్చింది.అదేమిటంటే ఈ సినిమాకి టైటిల్ ని కూడా ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ మొదటి కొడుకు పేరు కలిసి వచ్చేలా ఈ సినిమాకి ‘అభయం’ అనే టైటిల్ ని పెట్టినట్టు ఫిల్మ్ నగర్ లో ఒక టాక్ జోరుగా వినిపిస్తుంది.24 వ తేదీన ముహూర్తం కాబట్టి ఆరోజే ఈ సినిమా టైటిల్ ని కూడా అధికారికంగా ప్రకటించబోతున్నారు అంట. ఇన్ని రోజులు కొత్త సినిమా అప్డేట్ కోసం ఎదురు చూసిన ఫ్యాన్స్ కి ఇక నుండి రోజుకో అప్డేట్ రాబోతున్నట్టు తెలుస్తుంది.ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ కాగా శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతుంది.
