
Junior NTR
Junior NTR: స్టార్ అయితే సరిపోదు దాన్ని ఎల్లలు దాటించే నమ్మకమైన వ్యక్తులు కొందరు ఉండాలి. టాలీవుడ్ ప్రతి స్టార్ హీరో తమ వ్యవహారాలను చూసుకునే కొందరిని కలిగి ఉన్నారు. కొత్త ప్రాజెక్ట్స్, ఎండార్స్మెంట్స్, ప్రమోషన్స్ వంటివి చూసుకోవడంలో వారి పాత్ర ఎంతగానో ఉంది. చెప్పాలంటే అల్లు అర్జున్ కి బన్నీ వాసు, పవన్ కళ్యాణ్ కి త్రివిక్రమ్, ప్రభాస్ కి యూవీ వంశీ, రామ్ చరణ్ కు ఉపాసన, మహేష్ కి నమ్రత శిరోద్కర్ ఉన్నారు. ఈ స్టార్స్ సక్సెస్ లో వీరు కీలకం అవుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో తమకు తెలిసిన ఛానల్స్ ద్వారా ప్రమోట్ చేస్తుంటారు.
మహేష్ బాధ్యతలు తీసుకున్న నమ్రత ఆయన ఇమేజ్ మార్చేసింది. ఆయన స్టార్డం, మార్కెట్ పెరగడంలో ఆమె రోల్ చాలా ఉంది. బాలీవుడ్ లో తనకున్న సంబంధాల ద్వారా అనేక బ్రాండ్స్ కి ఆయన ప్రచారకర్తగా ఉండేలా చేశారు. ఆ విధంగా కోట్ల సంపాదన ఆర్జిస్తున్నారు. అలాగే భర్త సంపాదన వ్యాపారాల వైపు మళ్లిస్తున్నారు. ఉపాసన సైతం తన బిజినెస్ మైండ్ తో చరణ్ కెరీర్లో ఎదగడంలో కీలక పాత్ర వహిస్తున్నారు.

Junior NTR
ఈ విధమైన సప్పోర్ట్ ఎన్టీఆర్ కి కరువైందన్న వాదన వినిపిస్తోంది. ఎన్టీఆర్ ని మంచిగా గైడ్ చేసే వాళ్ళు, ఆయన స్టార్డం సక్రమంగా వాడుకునేలా సలహాలు ఇచ్చేవాళ్లు లేరని కొందరి అభిప్రాయం. కళ్యాణ్ రామ్ ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ వ్యవహారాలు చక్కబెట్టలేకపోతున్నారు. ఈ క్రమంలో ఆయన సినిమాలు కూడా ఆలస్యం అవుతున్నాయంటున్నారు. ఎన్టీఆర్ తో పాటు ఆర్ ఆర్ ఆర్ మూవీ చేసిన రామ్ చరణ్ ఆల్రెడీ ఒక మూవీ విడుదల చేశారు. ఆచార్యతో ప్రేక్షకులను పలకరించారు.
దర్శకుడు శంకర్ తో 15వ చిత్రం సగానికి పైగా కంప్లీట్ చేశారు. ఎన్టీఆర్ మాత్రం కనీసం మరో మూవీ సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. దర్శకుడు కొరటాల శివతో పలకరించిన మూవీ మీన మేషాలు లెక్కపెడుతుంది. ఈ ప్రాజెక్ట్ ప్రకటించి ఏడాది దాటిపోతున్నా పట్టాలెక్కలేదు. ఎన్టీఆర్ చిత్రాలు ఆలస్యం కావడానికి ఆయనకు సరైన మార్గదర్శకులు లేకపోవడమే అంటున్నారు. అటు సినిమాల పరంగా, ఆర్జన పరంగా, ఫేమ్ పరంగా ఎన్టీఆర్ వెనుకబడిపోతున్నారనేది టాలీవుడ్ టాక్,