Umamaheshwari : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎన్టీఆర్ కుమార్తె ఉమా మహేశ్వరి సంచలన లేఖ
Umamaheshwari : ఒక మరణం.. వెనుక ఎన్నో కోణాలు.. ఎన్నో అభూతకల్పనలు.. ఎన్నో అనుమానాలు.. వాటన్నింటికి తెరదించేది కొందరే.. ఒక్కటి చనిపోయిన ఉమామహేశ్వరి సూసైడ్ లేఖ అయినా రాసి ఉండాలి.. లేదంటే ఆమె కుటుంబ సభ్యులకు అయినా తెలియాలి. ఎన్టీఆర్ చిన్న కూతురు ఆత్మహత్య వెనుక అసలు కారణాలు ఏమై ఉంటాయన్న ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొన్నాయి. సోషల్ మీడియాలో మాత్రం ‘ఉమా మహేశ్వరి’ చివరి లేఖ అంటూ ఒకటి సర్క్యూలేట్ అవుతోంది. అందులోని కొన్ని వ్యాఖ్యలు […]

Umamaheshwari : ఒక మరణం.. వెనుక ఎన్నో కోణాలు.. ఎన్నో అభూతకల్పనలు.. ఎన్నో అనుమానాలు.. వాటన్నింటికి తెరదించేది కొందరే.. ఒక్కటి చనిపోయిన ఉమామహేశ్వరి సూసైడ్ లేఖ అయినా రాసి ఉండాలి.. లేదంటే ఆమె కుటుంబ సభ్యులకు అయినా తెలియాలి. ఎన్టీఆర్ చిన్న కూతురు ఆత్మహత్య వెనుక అసలు కారణాలు ఏమై ఉంటాయన్న ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొన్నాయి. సోషల్ మీడియాలో మాత్రం ‘ఉమా మహేశ్వరి’ చివరి లేఖ అంటూ ఒకటి సర్క్యూలేట్ అవుతోంది. అందులోని కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనమయ్యాయి. అది నిజమైన లేఖనో లేదా సృష్టించిందో తెలియదు కానీ ఇప్పుడా లేఖ మాత్రం అందరినీ షేక్ చేస్తోంది.
తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు చిన్న కుమార్తె ఆత్మహత్య కు ముందు సంచలన లేఖ రాసి చనిపోయినట్లుగా ప్రచారం సాగుతోంది. సుమారు 10 పేజీల లేఖ రాశారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఆ లేఖలో ఏముంది? ఏం రాశారు? అన్నది ఇప్పుడు అందరూ ఆరాతీస్తున్నారు.
‘‘ఆ లేఖ సారాంశం ఇదీ’’
‘‘నందమూరి కుటుంబ అభిమానులకు, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మీ అభిమాన నాయకుడి కుమార్తె ఉమా మహేశ్వరి అను నా చివరి లేఖ ఏమనగా,
నా తండ్రి గారు కీర్తిశేషులు రామారావు గారు ఎన్నో కష్టనష్టాలు, బరువు బాధ్యతల నడుమ కుటుంబ బాధ్యతలు మోస్తూ ,ఏ నాడు మాకు చిన్నలోటు కూడా కనపడకుండా పెంచి పెద్ద చేశారు. ఆయన జ్ఞాపకాలే నా మధురాను భూతులుగా బతికించాయి. అన్న హరికృష్ణ గారి మీద నాన్నగారికి ఎనలేని ప్రేమ అభిమానం కలిగి ఉండేవి. ఎన్నో కష్టనష్టాలను పడుతూ తెలుగుజాతి ప్రజలకోసం ఏదైనా చేయాలన్న తలంపుతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గణనీయంగా పేరు తెచ్చారు. అధికారం అనే వ్యామోహం ప్రతీ ఒక్కరికీ ఉంటుంది.అలాగే మా కుటుంబంలోకి వచ్చిన ఒక రాబందు కన్ను ఆ అధికారం మీద పడింది. ఆ విధంగా నాన్నగారికి కొడుకులను కూతుళ్ళను ఒక్కొరికి అభిప్రాయ బేధాలు సృష్టించసాగారు.ఆయన్ను ఒంటరివాడిని చేయసాగారు. ఈ సందర్భంలోనే పిన్నమ్మ శ్రీ లక్ష్మీ పార్వతి గారు అన్ని బాగోగులు చూస్తూ ఆయనకు ఒంటరితనం దగ్గరికి రానివ్వకుండా చూసుకున్నారు. నాన్నగారి మీద మా కుటుంబ సభ్యులకు అందరికి చెడు అభిప్రాయం తీసుకువచ్చేలా చేసిన కుటిల ప్రయత్నాలు ఫలించాయి ఆ రాబందుకు. ఆవిధంగా మాయమాటలు చెప్పి మమ్మల్ని తన బాటలోకి తెచ్చుకున్నాడు. చివరికి నాన్నగారికి మనోవేదనకు గురి చేసి ఒంటరివాడిని చేసి తన చావుకు కారణం అయ్యాడు. నాన్నగారు ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు మా అందరితో నా తర్వాత కుటుంబ బాధ్యతలు, పార్టీ బాధ్యతలు అన్నీ కూడా హరికృష్ణ నే చూడాలి అంటూ ప్రతి సందర్భంలోనూ చెప్పేవాడు. మా ఆస్తులు పంపకంలో కూడా ఆ రాబందు దగ్గరుండి అందరికి అన్యాయం చేస్తూ తన భార్యకు మాత్రం ఆస్తిలో అధికభాగం కేటాయించుకునేలా తన నక్కజిత్తుల తెలివితేటలు తో మమ్మల్ని ఇబ్బందిపాలు చేసాడు.
చివరికి మా కుటుంబ సభ్యులకు మాయమాటలు చెప్పి అధికారం చేజిక్కించుకుని హరికృష్ణకు మంత్రి పదవి ఇచ్చి కొద్దిరోజుల్లోనే తీసేసాడు.ఎక్కడ తనకు రాజకీయంగా అడ్డు వస్తాడో అనే తెలివి ఉపయోగించాడు ఆ రాబందు. ఆ రోజు నుండి అన్న హరికృష్ణ గారు ఆ రాబందును ఛీకొట్టాడు. ఏనాడు బావ అని పిలిచే ప్రసక్తే లేదు అనేవాడు. ఆ కక్ష్యను మనసులో ఉంచుకున్న రాబందు హరికృష్ణ పిల్లల భవిష్యత్ కు కూడా అడ్డుపడ్డాడు. ప్రతి విషయంలోనూ ఎదగనీయకుండా చేసాడు. చివరికి కళ్యాణ్ రామ్ నిర్మించిన ఒక సినిమా విషయంలో థియేటర్ లు కూడా దక్కకుండా చేసి ఆర్థికంగా దెబ్బతీసాడు. ఇక చిన్నోడు జూనియర్ ని రాజకీయంగా వాడుకుని, రాబందు సింపతి కోసం ఆక్సిడెంట్ చేయించి ఒకవేళ చనిపోతే ఇలాగైనా టీడీపీ పార్టీ మీద జాలి దయతో మనం అధికారంలోకి రావచ్చు అనే నీచపు ఆలోచనతో అంత దుర్మార్గపు పని చేశాడని తెలిసింది. దేవుడి దయవల్ల బతికి బయట పడ్డాడు.ఆ విషయం తెలుసుకున్న చిన్నోడు ఏరోజు రాజకీయంగా వెళ్లను, ఆ రాబందు బతికి ఉన్నంతకాలం అని నాకు మాట ఇచ్చాడు. నందమూరి కుటుంబ సభ్యుల చావుతో రాజ్యం ఏలాలి అనుకునే నీచ మనస్తత్వం ఆ రాబందు ది.
నందమూరి అభిమానులు ఎవరూ కూడా ఆ రాబందును నమ్మకండి. మా కుటుంబానికే మాయమాటలు చెప్పి మా చావుల మీద రాజ్యం ఎలుతూ ఉన్నాడు. ఇక మీరు ఒక లెక్కా. అమ్మా భువ మీరు నా ఆస్థి మాత్రమే చూసారు, నేను నిన్ను అక్కా అని ప్రేమగా చూశాను ఇప్పటికైనా కళ్ళు తెరిచి లోకాన్ని చూడు. మీ భర్త మన పుట్టింటికి చేసిన మోసాన్ని బయటపెట్టు. నాన్న మరణానికి కారణం బయట పెట్టి కూతురుగా పుట్టినందుకు నీ ఋణం తీర్చుకో, నాన్న కోరిక నీకు తెలుసు హరికృష్ణ అన్నకు బాధ్యతలు అప్పగించాలని ఆ కోరిక నెరవేర్చలేకపోయము మన కుటుంబ సభ్యులం. తెలివిగా నన్ను ప్రేమగా చూసుకునే బాలయ్యను కూడా మీ రాజకీయానికి బుట్టలో వేసుకుని అభం శుభం తెలియని అమ్మాయిని కోడలిగా చేసుకుని ఆ అమ్మాయి కొరికల్ని నాశనం చేశారు. ఇక బాలయ్య ను రాజకీయంగా అడ్డు తొలగించుకున్నారు.
నాన్నగారి ఆఖరి కోరిక , నా ఆఖరి కోరిక తీర్చే బాధ్యత నందమూరి అభిమానులదే.
హరి అన్న బ్రతికి లేకపోవడం వలన కనీసం మా కుటుంబ బాధ్యతలు , నాన్నగారు స్థాపించిన పార్టీ బాధ్యతలు చిన్నోడు రామారావు కి దక్కేలా చేయాలని కోరుకుంటున్నాను.అప్పుడే నా ఆత్మ , మీరు ఆరాధించే అన్నగారి ఆత్మ శాంతిస్తుంది అని నమ్ముతున్నాను.
ఈ మనోవేదనతో ఆ రాబందు చేసిన మోసాలు నా మనసుని కదిలిస్తూ ఉన్నాయి నిత్యం. అందుకే నేను బతకలేక నే చనిపోతున్నాను. పిన్నమ్మ లక్ష్మీపార్వతి గారు నన్ను క్షమిస్తారని ఆశిస్తూ ఉన్నాను.
మీ ఉమామహేశ్వరి
మీరు ఆరాధించే అన్నగారి ముద్దుల కూతురిని.’’ అంటూ ఆ లేఖలోని సారాంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చూస్తుంటే ఈ లేఖ మొత్తం చంద్రబాబును విలన్ ను చేయడానికి.. హరికృష్ణను, ఆయన సంతానం జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీ బాధ్యతలు అప్పగించి చంద్రబాబును సాగనంపాలన్నదే ఉద్దేశంగా ఉంది. చంద్రబాబు చేసిన మోసాలను కళ్లకు కట్టారు. చూస్తుంటే ఇదేదో రాజకీయ కక్షసాధింపు లేఖగా కనిపిస్తోంది. ఉమామహేశ్వరి ఇంట్లో ఓ లేఖ దొరికిందని తాజాగా లక్ష్మీపార్వతి కూడా అనుమానించారు. చంద్రబాబు వచ్చాక దాన్ని మాయం చేశారని ఆరోపించారు. మరి అందులో నిజం ఉందో లేదో తెలియదు కానీ.. ఈ లేఖ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.