
NTR On Oscar
NTR On Oscar: ఈ ఏడాది ఆస్కార్స్ ఇండియాకు చాలా స్పెషల్. మనకు రెండు అవార్డ్స్ దక్కాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీతో పాటు ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్స్ గెలుచుకున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి స్వరపరచిన నాటు నాటు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అందుకుంది. కీరవాణి, చంద్రబోస్ వేదికపైకి వెళ్లి ఆస్కార్ విన్నింగ్ మూమెంట్స్ అనుభవించారు. కీరవాణి తన ఆనందాన్ని షార్ట్ అండ్ స్వీట్ గా వ్యక్తపరిచారు. ఇక ఆర్ ఆర్ ఆర్ హీరోలుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రఖ్యాత ఆస్కార్ వేడుకలో పాల్గొనే అరుదైన ఛాన్స్ దక్కించుకున్నారు.
మరి ఆస్కార్ వేడుకకు ఆహ్వానం దక్కడం అంటే చిన్న విషయం కాదు. ప్రపంచం మొత్తం ఆస్కార్ అతిథులను గమనిస్తుంది. ముఖ్యంగా తారలు ధరించిన బట్టల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఇక ఎన్టీఆర్ ఆస్కార్ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా ఒక డ్రెస్ డిజైన్ చేయించుకున్నారు. సదరు డ్రెస్ ఎడమ భుజం మీద గర్జిస్తున్న టైగర్ సింబల్ ఉంది. ఆస్కార్ ఈవెంట్లో ఓ విలేఖరి ఆ పులి బొమ్మ గురించి అడగ్గా… టైగర్ ఇండియా నేషనల్ యానిమల్ అని చెప్పాడు ఎన్టీఆర్.

NTR On Oscar
అయితే అదే ఇప్పుడు ఆయన పరువు తీసింది. గతంలో షాహిద్ కపూర్ ఓ ఈవెంట్ కోసం సేమ్ డ్రెస్ వేసుకున్నారు. షాహిద్ కపూర్ ఫోటోలు బయటకు తీస్తున్న యాంటీ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని అల్లాడిస్తునారు. ఆస్కార్ వంటి ప్రతిష్టాత్మక వేడుకకు వెళ్ళేటప్పుడు ఒకరి డ్రెస్ ను పోలిన డ్రెస్ వేసుకోవడమేంటి? కొంచెం చూసుకోవాలి కదా! అని ఎద్దేవా చేస్తున్నారు. గతంలో ఇలాంటి డ్రెస్ షాహిద్ వేసుకున్న విషయం ఎన్టీఆర్ కి తెలుసో తెలియదో కానీ… అనవసరంగా దొరికిపోయాడు.
ఫ్యాన్స్ మాత్రం ఎన్టీఆర్ ని సమర్థిస్తున్నారు. సదరు డ్రెస్ ఎన్టీఆర్ కి బాగా నప్పింది. ఆస్కార్ ఈవెంట్లో ఎన్టీఆర్ అద్భుతంగా ఉన్నాడని కొనియాడుతున్నారు. మొత్తంగా ఎన్టీఆర్ ధరించిన డ్రెస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. కాగా ఎన్టీఆర్ తన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. దర్శకుడు కొరటాల శివతో ప్రకటించిన 30వ చిత్రం కొద్దిరోజుల్లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 2024 ఏప్రిల్ 5న ఈ చిత్రం సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నారు.