Unstoppable With NBK- NTR And Kalyan Ram: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులకు ఇది బిగ్ గుడ్ న్యూసే. బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఈ షోకు సినీ, రాజకీయ రంగం నుంచి ఎందరో ప్రముఖులు వచ్చారు. వారి పర్సనల్ విషయాలను బాలయ్య తన చాకచక్య ప్రశ్నలతో బయటపెట్టి అలరించారు. దీంతో ‘అన్ స్టాపబుల్’ షోకు మరింత ఊపొచ్చింది. అయితే ఈ షోకు జూనియర్ ఎన్టీఆర్ ను పిలిపించాలని నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఈ వేదికగా బాబాయ్, అబ్బాయ్ కలిస్తే షో యమ క్రేజీగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ తరుణంలో షో నిర్వాహకులు కూడా అదే ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం జూనియర్ ఎన్టీఆరే కాకుండా కల్యాణ్ రామ్ కూడా ఈ షో కు రాబోతున్నట్లు సమాచారం.

Unstoppable With NBK- NTR
ఓటీటీ సంస్థ ‘ఆహా’ వేదికగా బాలయ్య ‘అన్ స్టాపబుల్’ అనే షోకు హోస్టుగా చేస్తున్నారు. దీని మొదటి సీజన్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. గత నెలలో రెండో సీజన్ ప్రారంభమైంది. ముందుగా రాజకీయ రంగం నుంచి మాజీ సీఎం చంద్రబాబునాయుడు తదితరులను గెస్టులుగా పిలిచారు. ఆ తరువాత సినీ రంగం నుంచి కొందరిని పిలిచారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ను పిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే ఇటీవల ఆయన షో కు రానని చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
కానీ తాజాగా బాలయ్య షో కు జూనియర్ ను ఎలాగైనా తీసుకొచ్చే పనిలో పడిందట షో బృందం. కేవలం జూనియర్ నే కాదు అయన అన్న కళ్యాణ్ రామ్ ను కూడా తీసుకొస్తారని అంటున్నారు. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ఆయన నటించిన ‘బింబిసార’ సక్సెస్ జోష్లో ఉన్నారు. ఆ సినిమా సందర్భంగా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి జూనియర్ తో కలిసి కల్యాణ్ రామ్ హాజరయ్యారు. ఆ సందర్భంంలో వీరిద్దరి పక్కపక్కనే చూడడంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషించారు.

Unstoppable With NBK- NTR
ఇప్పుడు వీరిద్దరు కలిసి బాబాయ్ కార్యక్రమంలో పాల్గొననుండడంతో ఫ్యాన్స్ ఎక్సైట్మెంట్ గా ఫీలయ్యే అవకాశం ఉంది. అన్ స్టాపబుల్ షో నిర్వాహకులు కూడా వీరిని రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ విషయాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అయితే కచ్చితంగా కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి ఈ షోకు హాజరవుతారని అంటున్నారు. అప్పుడు నందమూరి ఫ్యామిలీ అంతా ఒకే చోట ఉంటే ఆ షో అద్బుతంగా సాగుతుందని షో నిర్వాహకులు సైతం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ఈ కలయిక ఎప్పుడు ఉంటుందో చూడాలి.