
NTR
NTR- Vishwak Sen: యంగ్ హీరోలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని క్రియేట్ చేసుకున్న ఇండస్ట్రీ కి వచ్చిన అతి తక్కువ సమయం లోనే యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించిన హీరో విశ్వక్ సేన్.’ఈ నగరానికి ఏమైంది’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరో గా పరిచయమైన విశ్వక్ సేన్ తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు.ఆ సినిమా కేవలం కమర్షియల్ సక్సెస్ మాత్రమే కాదు,టాలీవుడ్ లో కల్ట్ క్లాసిక్ గా కూడా నిల్చింది.
ఆ తర్వాత కూడా వెరైటీ కథలను ఎంచుకుంటూ కేవలం హీరో గా మాత్రమే కాకుండా డైరెక్టర్ గా కూడా సక్సెస్ లు అందుకున్నాడు.ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన హీరో గా , దర్శకుడిగా మరియు నిర్మాతగా ఇలా త్రిపాత్రాభినయం చేస్తూ తీసిన చిత్రం ‘మాస్ కా ధమ్కీ’.ఈ నెల 22 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో ఘనంగా జరిగింది.

NTR- Vishwak Sen
ఈ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి, ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘విశ్వక్ సేన్ నాకు ఫోన్ చేసినప్పుడు చెప్పిన కొన్ని మాటలు విని చాలా బాధేసింది.అన్నా ఈ సినిమా కోసం ఉన్నది మొత్తం ఖర్చు పెట్టేసాను.ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మీరు రావాలి అన్నా అని అన్నాడు.అది విన్న తర్వాత చాలా బాధేసింది.అతని మాటల్లో సినిమా మీద ఉన్న ప్రేమ కనిపించింది, నేను ఎప్పుడైనా మూడ్ ఆఫ్ లో ఉన్నప్పుడు చూసే అతి కొద్దీ సినిమాలలో ఒకటి ‘ఈ నగరానికి ఏమైంది’.అందులో విశ్వక్ సేన్ నటన అద్భుతం, కామెడీ చెయ్యకుండా కూడా అతను కామెడీ పండించాడు అందులో.ఇక ఆ తర్వాత ‘ఫలక్ నూమా దాస్’ సినిమా చూసాను.ఆ చిత్రానికి ఆయన దర్శకత్వం కూడా వహించాడు, ఇప్పుడు మళ్ళీ ఆయన ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.ఇది పెద్ద హిట్ అయ్యి ఇక ఆయన దర్శకత్వం మానేయాలని కోరుకుంటున్నాను..ఎందుకంటే యంగ్ టాలెంట్ ని ప్రోత్సహించాలి.వాళ్ళు ప్రోత్సహిస్తేనే మేము కూడా చూసి ప్రోత్సహించగలం.తెలుగు సినిమా ఇప్పుడు ప్రపంచపటం లో అగ్రస్థానం లో ఉంది.అది అలాగే ఉండాలి ‘ అంటూ ఎన్టీఆర్ ఈ సందర్భంగా మాట్లాడాడు.