NTR – Ram Charan : రామ్ చరణ్ బర్త్ డే పార్టీకి ఎన్టీఆర్ డుమ్మా… తెరపైకి కొత్త అనుమానాలు?

NTR – Ram Charan : రామ్ చరణ్ బర్త్ డే పార్టీ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. చిరంజీవి నివాసంలో ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం.  ఈ వేడుకలో రామ్ చరణ్, ఉపాసన కలిసి ఫోటోలకు ఫోజిచ్చారు. ఉపాసన టైట్ బాడీ కాన్ డ్రెస్ ధరించారు. ఆమె బేబీ బంప్ రివీల్ చేసేలా ఆ డ్రెస్ ఉంది. రామ్ చరణ్ బర్త్ డే పార్టీకి టాలీవుడ్ మొత్తం తరలి వచ్చింది. నాగ్ ఫ్యామిలీ, రాజమౌళి, […]

  • Written By: SRK
  • Published On:
NTR – Ram Charan : రామ్ చరణ్ బర్త్ డే పార్టీకి ఎన్టీఆర్ డుమ్మా… తెరపైకి కొత్త అనుమానాలు?

NTR – Ram Charan : రామ్ చరణ్ బర్త్ డే పార్టీ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. చిరంజీవి నివాసంలో ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం.  ఈ వేడుకలో రామ్ చరణ్, ఉపాసన కలిసి ఫోటోలకు ఫోజిచ్చారు. ఉపాసన టైట్ బాడీ కాన్ డ్రెస్ ధరించారు. ఆమె బేబీ బంప్ రివీల్ చేసేలా ఆ డ్రెస్ ఉంది. రామ్ చరణ్ బర్త్ డే పార్టీకి టాలీవుడ్ మొత్తం తరలి వచ్చింది. నాగ్ ఫ్యామిలీ, రాజమౌళి, విజయ్ దేవరకొండ, కాజల్ అగర్వాల్, శ్రీకాంత్, నిఖిల్, మంచు మనోజ్, లక్ష్మి, కీరవాణి, దర్శకుడు మెహర్ రమేష్, ప్రశాంత్ నీల్… తదితరులు హాజరయ్యారు.

ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఈ బర్త్ డే పార్టీలో పాల్గొనలేదు. ప్రభాస్ కి అనారోగ్యం అని తెలుస్తుంది. ఇక పవన్ బిజీ షెడ్యూల్స్ కారణంగా హాజరుకాలేదు. అయితే ఎన్టీఆర్, అల్లు అర్జున్ రాకపోవడం పుకార్లకు తెరలేపుతుంది. బన్నీ సంగతి అటుంచితే… ఎన్టీఆర్ ఈ పార్టీకి ఖచ్చితంగా హాజరు కావాలి. ఆర్ ఆర్ ఆర్ హీరోలుగా వీరిద్దరూ కలిసి అరుదైన విజయం నమోదు చేశారు. ఏకంగా ఆస్కార్ గెలిచిన చిత్ర హీరోలుగా రికార్డులకు ఎక్కారు. నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ దక్కడంలో టీం వర్క్ తో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కృషి ఎంతగానో ఉంది.

తమ సాటిలేని డాన్సింగ్ స్కిల్స్ తో నాటు నాటుకు విపరీతమైన ప్రాచుర్యం కల్పించారు. అయితే ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎవరు ఎక్కువ? ఎవరు తక్కువ? ఎవరికి ఎక్కువ ఫేమ్ దక్కింది? అనే పోలికలు తెరపైకి వచ్చాయి. ఈ విషయంలో రామ్ చరణ్ దే పైచేయి అయ్యింది. అమెరికాలో రామ్ చరణ్ కి ఊహించని గౌరవం దక్కింది. దీంతో ఎన్టీఆర్ హర్ట్ అయ్యారనే వాదన ఉంది. తాజాగా ఎన్టీఆర్ రామ్ చరణ్ బర్త్ డే పార్టీని స్కిప్ చేయడంతో ఈ అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.


ఆర్ ఆర్ ఆర్ విడుదల వరకు ఎన్టీఆర్-రామ్ చరణ్ చాలా అన్యోనంగా ఉన్నారు. ఈ మూవీ మొదలు కావడానికి ముందు ఇద్దరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాదిరి మెలిగారు. మరి నగరంలో ఉండి కూడా ఎన్టీఆర్ ఎందుకు రాలేదనేది అర్థం కాలేదు. ఆయన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ 30 షూటింగ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. చిత్రీకరణ అయితే మొదలు కాలేదు. కాగా మరో స్టార్ అల్లు అర్జున్ ఈ పార్టీని స్కిప్ చేశారు. ఆయన తండ్రి అల్లు అరవింద్ వచ్చారు కానీ బన్నీ రాలేదు.