
Janhvi Kapoor
Janhvi Kapoor: ఎట్టకేలకు జాన్వీ కపూర్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెడుతుంది. శ్రీదేవి వారసురాల్ని ఇక్కడకు తేవాలన్న ప్రయత్నాలు ఫలించాయి. ఎన్టీఆర్ 30 మూవీతో ఆమె తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. జాన్వీ కపూర్ ఇప్పుడిప్పుడే కెరీర్లో ఎదుగుతున్నారు. అనూహ్యంగా ఆమెకు భారీ ఆఫర్ దక్కింది. దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ కి జంటగా జాన్వీని ఎంపిక చేశారు. ఈ కాంబినేషన్ ఫుల్ కిక్ ఇస్తుంది. కారణం జాన్వీ కపూర్ దివంగత నటి శ్రీదేవి కూతురు కావడమే. సౌత్ ఇండియా ప్రేక్షకుల కలల రాణిగా వెలిగిన శ్రీదేవి వెండితెరపై చెరగని ముద్ర వేశారు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ తాత నందమూరి తారక రామారావు తో కలిసి శ్రీదేవి చరిత్ర సృష్టించారు. ఎన్టీఆర్-శ్రీదేవిల కాంబినేషన్ ఎవర్ గ్రీన్ హిట్. వారి వారసులు జూనియర్ ఎన్టీఆర్-జాన్వీ కలిసి నటించడం విశేషత సంతరించుకుంది. కాగా ఈ ప్రాజెక్ట్ గురించి జాన్వీ కపూర్ అందరికంటే పిచ్చ ఎగ్జైట్మెంట్ లో ఉందట. ఆ విషయాన్ని మీడియా వేదికగా తెలియజేసింది. తాజాగా మీడియాతో ముచ్చటించిన ఈ యంగ్ లేడీ ఎన్టీఆర్ మీద వల్లమాలిన అభిమానం, ఇష్టం ప్రదర్శించింది.
నేను గతంలో కూడా పలుమార్లు చెప్పాను. నాకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఆయన మూవీలో నటించే ఛాన్స్ కోసం ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నాను. ఎన్టీఆర్ పక్కన అవకాశం రావాలని ప్రార్ధనలు చేశాను. అవి ఫలించాయి. ఎట్టకేలకు నా కల నిజమైంది. ఎన్టీఆర్ 30 సెట్స్ లోకి ఎప్పుడెప్పుడు వెళతానా? ఎప్పుడు షూటింగ్ మొదలవుతుందా? అనే ఆత్రుత నాలో ఉంది. రోజూ దర్శకుడు కొరటాల శివకు మెసేజ్లు పెడుతున్నాను. ఇటీవల మరోసారి ఆర్ ఆర్ ఆర్ చిత్రం చూశాను. ఎన్టీఆర్ అందం, ఉత్సాహం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయన పక్కన నటించే రోజు కోసం ఎదురు చూస్తున్నానని వెల్లడించారు.

Janhvi Kapoor
జాన్వీని ఎన్టీఆర్ 30 ఈ రేంజ్ లో ఫీల్ అయ్యేలా చేసిందా! అని సోషల్ మీడియా జనాలు వాపోతున్నారు. గతంలో మిల్లీ చిత్ర ప్రమోషన్ కోసం జాన్వీ కపూర్ హైదరాబాద్ వచ్చారు. అప్పుడు జాన్వీని ఇదే ప్రశ్న అడగ్గా… ఎన్టీఆర్ ఒక అద్భుతమైన నటుడు. ఆయనతో నటించే అవకాశం వస్తే అసలు వదులుకోనని ఆమె చెప్పారు. కాగా ఎన్టీఆర్ 30 నుండి జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇక మార్చి 23న పూజా కార్యక్రమాలతో మూవీ లాంచ్ చేస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలుకానుంది.