Site icon OkTelugu

Chetana Foundation Cancer Screening Camp: కాన్సర్‌పై ‘చేతన’ చైతన్యం.. పొన్నూరులో ఫౌండేషన్‌ వైద్య శిబిరం

Chetana Foundation Cancer Screening Camp

Chetana Foundation Cancer Screening Camp

Chetana Foundation Cancer Screening Camp: క్యాన్సర్‌ భారత దేశంలో వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేకపోవడంతో వ్యాధి ముదిరిపోయే వరకూ గుర్తించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా గ్రామీణప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలో నిర్వహిస్తోంది. ప్రభుత్వానికి తనవంతు సాయంగా, గ్రామీణుల్లో క్యాన్సర్‌పై చైతన్యం తెచ్చేలా చేతన ఫౌండేషన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కాన్సర్‌ అవగాహన, తొలిదశ నిర్ధారణ సేవలను అందించే లక్ష్యంతో చేతన ఫౌండేషన్‌ ఇండియా ఏప్రిల్‌ 6, 2026న గుంటూరు జిల్లా పొన్నూరులో కాన్సర్‌ స్క్రీనింగ్‌ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ మానవతా కార్యక్రమం దివంగత శ్రీమతి కొంగర భవాని స్మారకార్థం ఆమె కుటుంబ సభ్యులు (భారతదేశం, అమెరికాలో ఉంటున్నారు) ఉదారంగా స్పాన్సర్‌ చేశారు.

కాన్సర్‌ నిర్ధారణలో కీలక అడుగు
గ్రామీణ ప్రాంతాల్లో కాన్సర్‌ వ్యాధి గురించి అవగాహన లేకపోవడం, తొలిదశలో నిర్ధారణ జరగకపోవడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో చేతన ఫౌండేషన్‌ నిర్వహించిన ఈ శిబిరం పొన్నూరు, పరిసర గ్రామాల ప్రజలకు వరంగా మారింది. శిబిరంలో కాన్సర్‌ లక్షణాలు, నివారణోపాయాలు, తొలిదశ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా అందించబడ్డాయి.

దివ్యాంగులకు వీల్‌చైర్లు..
ఈ కార్యక్రమంలో కాన్సర్‌ స్క్రీనింగ్‌తోపాటు వికలాంగులకు వీల్‌చేర్లను పంపిణీ చేశారు. శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యక్తులకు ఈ వీల్‌చేర్లు గొప్ప ఆసరాగా నిలుస్తాయి. ఈ విధంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందించడం చేతన ఫౌండేషన్‌ లక్ష్యంగా మారింది.

ప్రజాప్రతినిధి సహకారం
పొన్నూరు ఎమ్మెల్యే ధూలిపల్ల నరేంద్రకుమార్‌ ఈ కార్యక్రమానికి విచ్చేసి, ఈ మానవతా కార్యక్రమానికి మద్దతు తెలిపారు. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు ఇటువంటి కార్యక్రమాలకు సహకరించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు మెరుగుపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

సంస్థల సహకారం
ఈ శిబిరం విజయవంతం కావడానికి ధూలిపల్ల వీరయ్య చౌదరి మెమోరియల్‌ ట్రస్ట్, డీవీసీ హాస్పిటల్స్, పొన్నూరు సహకారం అందించాయి. ఈ ఆసుపత్రి వైద్య బృందం నిపుణులైన డాక్టర్లతో కూడిన బృందం కాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి తదుపరి చికిత్స సూచనలు అందించారు. చేతన ఫౌండేషన్‌ స్వచ్ఛంద కార్యకర్తలు ఈ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ సరైన మార్గదర్శకత్వం అందించడం, నమోదు ప్రక్రియను సులభతరం చేయడం, వైద్య పరీక్షలు జరిగేలా చూసుకున్నారు.

చేతన ఫౌండేషన్‌ ఇటువంటి ఆరోగ్య శిబిరాలను మరిన్ని గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించాలని యోచిస్తోంది. కాన్సర్‌ వ్యాధి గురించి అవగాహన కల్పించడం, తొలిదశలో నిర్ధారణ చేయడం మరియు చికిత్స కోసం సరైన మార్గదర్శకత్వం అందించడం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవచ్చని సంస్థ విశ్వసిస్తోంది.

Exit mobile version