Pawan Kalyan : చెక్కుల పంపిణీకి కదిలొస్తున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan : ‘ఇప్పటం’ గ్రామస్థులు.. జనసేన ఆవిర్భావ సభ కోసం తమ భూములు ఇవ్వడమే వీరు చేసిన పాపం. అప్పటి నుంచి జగన్ సర్కార్ ఆగ్రహానికి బలి అవుతూనే ఉన్నారు. మొదట భూములిచ్చిన రైతులను బెదిరించారు. వారికి పథకాలు కట్ చేశారు. ఆ తర్వాత రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని.. ఆ మారు మూల గ్రామంలో రోడ్డు వెడల్పు పేరుతో జనసేనకు భూములిచ్చిన రైతుల ఇళ్లను కూలగొట్టించారు. వైసీపీ ప్రభుత్వ ప్రతీకారానికి పాపం ఇప్పటం రైతులు బలయ్యారు. […]

  • Written By: NARESH ENNAM
  • Published On:
Pawan Kalyan : చెక్కుల పంపిణీకి కదిలొస్తున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan : ‘ఇప్పటం’ గ్రామస్థులు.. జనసేన ఆవిర్భావ సభ కోసం తమ భూములు ఇవ్వడమే వీరు చేసిన పాపం. అప్పటి నుంచి జగన్ సర్కార్ ఆగ్రహానికి బలి అవుతూనే ఉన్నారు. మొదట భూములిచ్చిన రైతులను బెదిరించారు. వారికి పథకాలు కట్ చేశారు. ఆ తర్వాత రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని.. ఆ మారు మూల గ్రామంలో రోడ్డు వెడల్పు పేరుతో జనసేనకు భూములిచ్చిన రైతుల ఇళ్లను కూలగొట్టించారు. వైసీపీ ప్రభుత్వ ప్రతీకారానికి పాపం ఇప్పటం రైతులు బలయ్యారు.

అందుకే ఇప్పటంలో ఇళ్లు కూలగొట్టగానే జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ గ్రామాన్ని సందర్శించి వైసీపీ దమనకాండను ఎలుగెత్తిచాటాడు. తీవ్ర విమర్శలు గుప్పించారు. బాధితులను ఆదుకుంటానని హామీ ఇచ్చాడు. అన్నట్టుగా ఇప్పటంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఈ నెల 27న పవన్ కళ్యాణ్ ఆర్థికసాయం అందిస్తారని జనసేన పార్టీ ప్రకటించింది.

మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రూ.లక్ష చొప్పున చెక్కులను అందిస్తారని పేర్కొంది. జనసేన ఆవిర్భావ వేడుకలకు ఇప్పటం వేదికగా నిలిచిందని.. కార్యక్రమం కోసం ఆ గ్రామ రైతులు పొలాలను ఇచ్చారని గుర్తు చేసింది. రహదారి విస్తరణపేరుతో కొన్ని ఇళ్లను కూల్చడంతో పవన్ చలించిపోయారని తెలిపింది.

ఇప్పటం రైతులకు అండగా ఉంటానని ఈ చర్య ద్వారా పవన్ కళ్యాణ్ చాటి చెప్పనున్నారు. అందుకే స్వయంగా కదిలివస్తున్నారు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నా సరే తమ పార్టీకి అండగా నిలిచివారి కోసం పవన్ కళ్యాణ్ తరలివస్తున్నారు. వారికి ఆర్థిక సాయాన్ని స్వయంగా అందజేయనున్నారు.

Read Today's Latest Ap politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు