The Kerala Story: ‘కేరళ స్టోరీ’నే కాదు.. గుజరాత్‌ లోనూ ఓ స్టోరీ ఉంది?

వీరిలో కొంతమందిని మానవ అక్రమ రవాణా గ్రూపులు ఇతర రాష్ట్రాలకు తరలించి వ్యభిచార కూపంలోకి దించాయనే వాదనలు ఉన్నాయి. ఏళ్లుగా వారు వ్యభిచార కూఊపంలోనే మగ్గుతున్నారని తెలుస్తోంది.

  • Written By: Raj Shekar
  • Published On:
The Kerala Story: ‘కేరళ స్టోరీ’నే కాదు.. గుజరాత్‌ లోనూ ఓ స్టోరీ ఉంది?

The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ సినిమా వివాదం సృష్టిస్తున్న వేళ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ సొంత రాష్ట్రం గుజరాత్లో వేల మంది మహిళలు అదృశ్యమయ్యారనే విషయం సంచలనంగా మారింది. గత ఐదేళ్లలో ఆ రాష్ట్రంలో 40 వేల మందికి పైగా మహిళలు, బాలికలు కనిపించకుండా పోయారట. ఇది ఎవరో చెప్పింది, ఇంకెవరో ఆరోపణలు చేసింది కాదు.. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ అధ్వర్యంలోని జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్సీఆర్బీ) వెల్లడించింది. 2016 నుంచి 2020 మధ్య 41,821 మంది అదృశ్యమయ్యారని అధికారిక గణాంకాలు చెప్తున్నాయి.

వ్యభిచార కూపంలోకి..
వీరిలో కొంతమందిని మానవ అక్రమ రవాణా గ్రూపులు ఇతర రాష్ట్రాలకు తరలించి వ్యభిచార కూపంలోకి దించాయనే వాదనలు ఉన్నాయి. ఏళ్లుగా వారు వ్యభిచార కూఊపంలోనే మగ్గుతున్నారని తెలుస్తోంది.

విపక్షాల విమర్శలు..
కేరళ గురించి మాట్లాడే బీజేపీ నేతలు గుజరాత్లో వేల మంది మహిళల అదృశ్యంపై ఏం చెప్తారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి హిరేన్‌ బంకర్‌ ప్రశ్నించారు. మహిశల అదృశ్యం విషయాన్ని రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం కూడా గతంలో ఒప్పుకొన్నదని పేర్కొన్నారు.

ఉగ్రవాదంవైపు మరికొందరు..
అదృశ్యమైన మహిళలు, బాలికల్లో చాలా మంది వ్యభిచార కూపాల్లో మగ్గుతుండగా, కొంతమందిని మాత్రం ఉగ్రవాదంపైపు మళ్లించారని తెలుస్తోంది. కేరళ స్టోరీ తరహాలోనే మతం మార్చి ఉగ్రవాదులుగా మార్చి ఉంటారని సమాచారం.

పోలీసు వ్యవస్థ దారుణం
మహిళల మిస్సింగ్పై మాజీ ఐపీఎస్‌ అధికారి, గుజరాత్‌ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ సభ్యుడు సుధీర్‌ సిన్హా కీలక విషయాలు వెల్లడించారు. కొన్ని మిస్సింగ్‌ కేసుల్లో… మహిళలు, బాలికలను ఇతర రాష్ట్రాలకు తరలించి బలవంతంగా వ్యభిచారంలోకి దించడాన్ని తాను గమనించానని పేర్కొన్నారు. మిస్సింగ్‌ కేసులను పోలీసులు సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆరోపించారు. అదృశ్యం కేసులు హత్యల కంటే తీవ్రమైనవని అభిప్రాయపడ్డారు.

అదృశ్యమైన మహిళల సంఖ్య
2016 7,105
2017 7,712
2018 9,246
2019 9,268
2020 8,290

Read Today's Latest National politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు