Vastu Tips: ఇల్లు మాత్రమే కాదు …ఇంట్లో సామాను కూడా వాస్తు ప్రకారమే ఉండాలి అని మీకు తెలుసా?
ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తగ్గించి ఇంట్లో పాజిటివిటీని పెంచడం కోసం వాస్తు శాస్త్రజ్ఞులు కొన్ని నియమాలను తెలియజేశారు. అలా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్ ,సోఫా వంటి వస్తువులను ఏ దిశలో పెట్టుకోవాలో తెలుసుకుందాం.

Vastu Tips: ప్రతి మనిషికి ఇల్లు అనేది ఒక జీవితకాలం కల. అలాంటి ఇంటిని వాస్తు ప్రకారం ఎలా అయితే నిర్మించుకుంటామో మనం ఇంట్లో పెట్టుకునే వస్తువులను కూడా అదేవిధంగా వాస్తు ప్రకారం ఉండేలా చూసుకోవాలి. అప్పుడు ఆ ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు ధన ధాన్యాలు వృద్ధి చెందుతాయి. మనం ఇంట్లో ఎన్నో సామాన్లు పెట్టుకుంటాము. వీటన్నిటినీ వాస్తు ప్రకారం పెట్టుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.
ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తగ్గించి ఇంట్లో పాజిటివిటీని పెంచడం కోసం వాస్తు శాస్త్రజ్ఞులు కొన్ని నియమాలను తెలియజేశారు. అలా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్ ,సోఫా వంటి వస్తువులను ఏ దిశలో పెట్టుకోవాలో తెలుసుకుందాం. ఇలా ఆచరించడం వల్ల ఇంట్లో అనవసరంగా కలిగే మనస్పర్ధలు, చికాకులు వంటివి కూడా తొలగిపోతాయని వాస్తు శాస్త్రజ్ఞులు వెల్లడిస్తున్నారు.
సోఫా అనేది ప్రతి ఇంట్లో ఒక అలంకార సాధనంగా వాడుతారు. అయితే ఈ సోఫాలు మనకు ఎక్కడ తోచితే అక్కడ పెట్టకూడదు.. వాస్తు ప్రకారం వాటికంటూ ఒక నిర్దిష్ట స్థానం ఉంది. ఎక్కువగా సోఫా అని దక్షిణ లేక పశ్చిమ దిశలో పెట్టడం మంచిది. ఇలా చేయడం వల్ల ఇంటికి ఆనందంతో పాటు శ్రేయస్సు కూడా కలుగుతుంది…పైగా ఈ దిశలో సోఫాను పెట్టిన వారికి ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుంది.
ఇక రోజు మనం చూసే టీవీ విషయానికి వస్తే…. టీవీ ఎప్పుడు ఇంటి తూర్పు గోడకే ఉండాలి. వాల్ ఫిక్సింగ్ కాకుండా టేబుల్ పైన ఉన్న టీవీ అయినా సరే తూర్పు దిశగా ఉండేలా పెట్టుకోవాలి. ఇలా టీవీని తూర్పు దిశలో పెట్టుకొని చూడడం వల్ల ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. మనం నిత్యం సామాన్లు పెట్టుకునే ఫ్రిడ్జ్ విషయానికి వస్తే…ఎక్కడైనా పెట్టొచ్చు కానీ పొరపాటున కూడా ఈశాన్యం వైపు అస్సలు పెట్టకూడదు. ఫ్రిజ్ అనే కాదు ఇంటిలో ఈశాన్యం మూల ఎప్పుడు కూడా అధిక బరువు లేకుండా ఉంచడం మంచిది.
ఉత్తరం లేదా పశ్చిమం దిశలో ఫ్రిడ్జ్ పెట్టుకోవడం ఉత్తమంగా ఉంటుంది. ఇలా పెట్టడం వల్ల కలిసి రావడమే కాకుండా ఎటువంటి సమస్యలు ఉండవు. అలాగే ఫ్రిడ్జ్ పక్కన మైక్రోవేవ్ లేదా స్టవ్ లాంటివి పెట్టకూడదు. ఈ రెండు పక్క పక్కన ఉండడం వల్ల పలు రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్రంలో చెబుతారు. మీరు మీ ఇంట్లో సామాను సర్దుకునేటప్పుడు ఈ చిన్నపాటి జాగ్రత్తలను పాటించడం మంచిది.
