Balakrishna- Chiranjeevi: చిరంజీవి సినిమాకి పోటీగా రాకపోతే బాలయ్య ని ఎవ్వరు పట్టించుకోరా..? ప్రూఫ్స్ ఇదే

Balakrishna- Chiranjeevi: మన ముందు తరం స్టార్ హీరోలలో మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు ఎవరైనా ఉన్నారా అంటే అది మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ అని చెప్పొచ్చు..ఈ ఇద్దరి హీరోలు గత జనరేషన్ లో టాప్ 2 స్టార్స్ గా కొనసాగారు..కానీ బాలయ్య ఆ తర్వాత కొన్ని డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు తీసి తన స్టార్ స్టేటస్ ని పోగొట్టుకోగా, మెగాస్టార్ చిరంజీవి మాత్రం చెక్కు చెదరని స్టార్ స్టేటస్ […]

  • Written By: Neelambaram
  • Published On:
Balakrishna- Chiranjeevi: చిరంజీవి సినిమాకి పోటీగా రాకపోతే బాలయ్య ని ఎవ్వరు పట్టించుకోరా..? ప్రూఫ్స్ ఇదే

Balakrishna- Chiranjeevi: మన ముందు తరం స్టార్ హీరోలలో మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు ఎవరైనా ఉన్నారా అంటే అది మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ అని చెప్పొచ్చు..ఈ ఇద్దరి హీరోలు గత జనరేషన్ లో టాప్ 2 స్టార్స్ గా కొనసాగారు..కానీ బాలయ్య ఆ తర్వాత కొన్ని డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు తీసి తన స్టార్ స్టేటస్ ని పోగొట్టుకోగా, మెగాస్టార్ చిరంజీవి మాత్రం చెక్కు చెదరని స్టార్ స్టేటస్ తో రీ ఎంట్రీ తర్వాత కూడా తన సత్తాని చాటుతూ నేటి తరం స్టార్ హీరోలకు పోటీగా నిలిచాడు..అయితే ‘వాల్తేరు వీరయ్య’ కి ముందు మెగాస్టార్ చిరంజీవి సినిమాలు వరుసగా రెండు కమర్షియల్ గా ఫెయిల్ అయ్యాయి..’వీర సింహా రెడ్డి’ సినిమాకి ముందు బాలయ్య ‘అఖండ’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తో మంచి ఊపు మీద ఉన్నాడు.

Balakrishna- Chiranjeevi

Balakrishna- Chiranjeevi

దీనితో చిరంజీవి దురాభిమానులు బాలయ్య చేతిలో ఈసారి మెగాస్టార్ ఓడిపోవడం ఖాయమని అన్నారు..కానీ కథ అడ్డం తిరిగింది..’వాల్తేరు వీరయ్య’ మూవీ వసూళ్లకు మరియు ‘వీర సింహా రెడ్డి’ వసూళ్లకు మధ్య దాదాపుగా 40 కోట్ల రూపాయలకు పైగా గ్యాప్ ఉంది..చిరంజీవి కి కనీసం దగ్గర్లో కూడా రాలేకపోయాడు బాలయ్య బాబు..వాస్తవానికి ‘వీర సింహా రెడ్డి’ డిసెంబర్ నెలలో విడుదల అయ్యుంటే ఇంత స్థాయి వసూళ్లు అసలు వచ్చి ఉండేవి కాదని, మెగాస్టార్ చిరంజీవి తో పోటీ అన్నప్పుడే బాలయ్య సినిమా లైం లైట్ లోకి వచ్చిందని..లేకపోతే అసలు ఎవ్వరూ పట్టించుకునే వాళ్ళు కాదని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

Balakrishna- Chiranjeevi

Balakrishna- Chiranjeevi

2017 వ సంవత్సరం లో కూడా బాలయ్య తన నూరవ చిత్రం ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ ని మెగాస్టార్ ‘ఖైదీ నెంబర్ 150’ కి పోటీగా దింపాడు..అందువల్ల ఆ సినిమాకి బాగా హైప్ వచ్చి సుమారుగా 50 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..కానీ ఆ తర్వాత విడుదలైన బాలయ్య సినిమాలకు కనీసం పాతిక కోట్ల రూపాయిలు కూడా రాకపోవడం విశేషం..దీనినిబట్టీ చూస్తుంటే చిరంజీవి తో పోటీకి వస్తే కానీ బాలయ్య సినిమాలను ఎవ్వరూ పట్టించుకోరా అనే సందేహం ట్రేడ్ వర్గాల్లో నెలకొన్నాయి.

Tags

    follow us