Balakrishna- Nagarjuna: నందమూరి బాలకృష్ణ నోటి దూల కారణంగా ఇప్పుడు రెండు పెద్ద కుటుంబాల అభిమానుల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరిగేలా ఉన్నాయి..ఇటీవల జరిగిన ‘వీర సింహా రెడ్డి’ విజయోత్సవ సభ లో బాలయ్య బాబు అక్కినేని నాగేశ్వరరావు వర్థంతి అని కూడా చూడకుండా ‘అక్కినేని తొక్కినేని’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపింది.

Balakrishna- Nagarjuna
తెలుగు సినిమా ఇండస్ట్రీ కి మూలస్తంభం లాంటి వాడు..చెన్నై నుండి హైదరాబాద్ కి మన తెలుగు సినిమా షిఫ్ట్ అవ్వడానికి కృషి చేసిన మహానుభావుడు అక్కినేని నాగేశ్వరరావు గారిని ఆయన కుటుంబాన్ని కించపరిస్తే ఏ మాత్రం సహించబోమని,రాబొయ్యే రోజుల్లో జరగబొయ్యే పరిణామాలను ఎదురుకోవడానికి బాలకృష్ణ సిద్ధం గా ఉండాలని..పరిస్థితి చెయ్యి దాటకముందే అక్కినేని ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పాలంటూ ఒక ఉత్తరం ద్వారా డిమాండ్ చేసారు..ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
అయితే బాలయ్య చేసిన కామెంట్స్ పై అక్కినేని నాగ చైతన్య మరియు అక్కినేని అఖిల్ కూడా తమదైన శైలిలో కూల్ గా సమాధానం కౌంటర్ ఎసరు..ఇది ఇలా ఉండగా లేటెస్ట్ గా సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..అదేమిటంటే నందమూరి బాలకృష్ణ ఆహా మీడియా లో ‘అన్ స్టాపబుల్ విత్ NBK ‘ అనే ప్రోగ్రాం చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే.

Balakrishna- Nagarjuna
ప్రస్తుతం రెండవ సీజన్ చివరి దశలో ఉంది..ఈ సందర్భంగా రేపు ఒక విశిష్ట అతిథితో బాలయ్య బాబు ఎపిసోడ్ షూటింగ్ ఉంది..ఆ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లోనే జరుగుతుంది..ఇప్పుడు బాలయ్య బాబు అక్కినేని కుటుంబానికి మరియు ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పకపోతే అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ దాటి లోపలకు రానివ్వము అంటూ అక్కినేని ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చారు.
అంతే కాకుండా తన తండ్రి గౌరవానికి పదిమందిలో పరువు తీసే విధంగా మాట్లాడిన బాలయ్య మీద నాగార్జున పీకల్లోతు కోపంతో ఉన్నాడట..క్షమాపణలు చెప్పకపోతే ‘అన్ స్టాపబుల్’ షో కి మాత్రమే కాదు , బాలయ్య సంబంధించి ఏ చిన్న షూటింగ్ ని కూడా ఇక్కడ చేసుకునేందుకు అనుమతించబోమని నాగార్జున కఠినమైన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం..మరి రేపు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఎలాంటి ఉద్రిక్తత వాతావరణం ఉంటుందో చూడాలి.