ప్చ్.. హిట్ కి ప్లాప్ రేటింగ్, ప్లాప్ కి హిట్ రేటింగ్ !

టీవీల్లో ఏ సినిమా ఆడుతుందో ? ఏ సినిమా ప్లాప్ అవుతుందో ? అర్థం కాకుండా పోయింది. నితిన్ సినిమాల్లో ఈ మధ్య కాలంలో ఘోరంగా ఫ్లాప్ అయిన సినిమా ఏదైనా ఉంది అంటే.. అది చంద్రశేఖర్ యేలేటి తీసిన ‘చెక్’ సినిమానే. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా అత్యున్నతమైన డిజాస్టర్ గా నిలిచింది. ఓ దశలో ఈ సినిమాతో నితిన్ కి ఉన్న మార్కెట్ కూడా మొత్తం పోయేలా కనిపించింది. అంత బాగా ప్లాప్ […]

  • Written By: Raghava
  • Published On:
ప్చ్..  హిట్ కి ప్లాప్ రేటింగ్,  ప్లాప్ కి  హిట్ రేటింగ్ !

Check movieటీవీల్లో ఏ సినిమా ఆడుతుందో ? ఏ సినిమా ప్లాప్ అవుతుందో ? అర్థం కాకుండా పోయింది. నితిన్ సినిమాల్లో ఈ మధ్య కాలంలో ఘోరంగా ఫ్లాప్ అయిన సినిమా ఏదైనా ఉంది అంటే.. అది చంద్రశేఖర్ యేలేటి తీసిన ‘చెక్’ సినిమానే. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా అత్యున్నతమైన డిజాస్టర్ గా నిలిచింది.

ఓ దశలో ఈ సినిమాతో నితిన్ కి ఉన్న మార్కెట్ కూడా మొత్తం పోయేలా కనిపించింది. అంత బాగా ప్లాప్ అయింది ఈ సినిమా. అందుకే చాల చోట్ల రెండో షోకే ఈ సినిమా తన దుకాణాన్ని సర్దేసుకోవాల్సి వచ్చింది. రెండో రోజు తర్వాత చాలా థియేటర్ల నుంచి ఈ సినిమాని నిర్ధాక్ష్యంగా తీసి పక్కన పడేశారు.

మొత్తానికి చాల సంవత్సరాల తర్వాత.. అంటే బాలయ్య ‘ఒక్క మగాడు’ సినిమా తర్వాత, క్రిటిక్స్ చీల్చి చెండాడి తమ విశ్వ రూపం చూపించింది ఈ సినిమాకే. మరి ఇంత దారుణంగా ప్లాప్ అయిన సినిమాని ఇక టీవీల్లో ఎవరు చూస్తారు అనుకుంటాం. కానీ, విచిత్రంగా ఈ సినిమాకు టీవీల్లో మంచి టీఆర్పీ రేటింగ్ వచ్చింది. జెమినీ టీవీలో గత వారం ప్రీమియర్ గా ప్రసారం అయిన ఈ సినిమా పై జనం బాగానే ఆసక్తి చూపించారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని సిటీ ప్రాంతాల్లో ఈ సినిమాకి 8.53 రేటింగ్ రావడం నిజంగా విశేషమే. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే.. నితిన్ హిట్ సినిమా ‘రంగ్ దే’ జీ టీవీలో ప్రసారం అయినప్పుడు 7.22 రేటింగ్ వచ్చింది. కానీ నితిన్ భారీ ప్లాప్ సినిమాకి ఏకంగా 8.53 రేటింగ్ రావడం టీవీ సంస్థలకే అర్థం కావడం లేదు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు