‘అంధాధున్’లో నితిన్?

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అంధాదున్’ తెలుగులో రీమేక్ కాబోతుంది. తెలుగు నేటివిటీగా అనుగుణంగా కథలో మార్పులు జరుగుతున్నాయి. ఈ మూవీలో నితిన్ హీరోగా నటించనున్నాడు. నితిన్ సరసన హేబ్బాపటేల్ ఎంపికైందని తెలుస్తోంది. బాలీవుడ్లో విమర్శకుల ‘అంధాదున్’ విమర్శకుల ప్రశంసలను అందుకోవడమే కాకుండా జాతీయ అవార్డులను గెలుచుకొంది. ప్రస్తుతం తెలుగులో క్రైమ్ థిల్లర్స్ స్టోరీలకు ఆదరణ లభిస్తుంది. దీంతో ఈ మూవీని త్వరలోనే పట్టాలెక్కించేందుకు సన్నహాలు జరుగుతున్నాయి. ఈ మూవీ రీమేక్ హక్కులను నితిన్ తండ్రి సుధాకర్ […]

  • Written By: Neelambaram
  • Published On:
‘అంధాధున్’లో నితిన్?

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అంధాదున్’ తెలుగులో రీమేక్ కాబోతుంది. తెలుగు నేటివిటీగా అనుగుణంగా కథలో మార్పులు జరుగుతున్నాయి. ఈ మూవీలో నితిన్ హీరోగా నటించనున్నాడు. నితిన్ సరసన హేబ్బాపటేల్ ఎంపికైందని తెలుస్తోంది. బాలీవుడ్లో విమర్శకుల ‘అంధాదున్’ విమర్శకుల ప్రశంసలను అందుకోవడమే కాకుండా జాతీయ అవార్డులను గెలుచుకొంది. ప్రస్తుతం తెలుగులో క్రైమ్ థిల్లర్స్ స్టోరీలకు ఆదరణ లభిస్తుంది. దీంతో ఈ మూవీని త్వరలోనే పట్టాలెక్కించేందుకు సన్నహాలు జరుగుతున్నాయి. ఈ మూవీ రీమేక్ హక్కులను నితిన్ తండ్రి సుధాకర్ గతంలోనే దక్కించుకున్నాడు.

‘అంధాధున్’ మూవీలో అద్భుత నటన కనబర్చిన ఆయుష్మాన్ ఖురానా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్నాడు. ఈ మూవీలో అంధుడైన ప్లియోనో ప్లేయర్ ఓ హత్యకు ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తాడు. ఈ కథతో క్రైమ్ థిల్లర్ గా చిత్రం తెరకెక్కించి మంచి విజయం సాధించింది. ఈ మూవీలో రాధికా ఆప్టే, టబులు నటించారు. ఈ మూవీని తెలుగులో మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడు. ఈమేరకు హీరో నితిన్ స్వయంగా ప్రకటించాడు. ఈ మూవీని శ్రేష్ఠ మీడియా, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు.

‘అంధాదున్’ మూవీని మేకపాటి గాంధీ క్రైమ్ కెమెడీ థ్రిల్లర్ గా తెరకెక్కించబోతున్నాడు. వెంకట్రాది ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజాలతో మంచి గుర్తింపు తెచ్చకున్నాడు. చివరగా తీసిన కృష్ణార్జున యుద్ధం ఫ్లాప్ కావడంతో అవకాశాలు తగ్గాయి. దీంతో ‘అంధాదున్’ రీమేక్ తో విజయం సాధించి మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. ప్రస్తుతం నితిన్ భీష్మ మూవీ ప్రమోషన్లలో బీజీగా ఉన్నాడు. ఈనెల 21న చిత్రం విడుదల కానుంది. ‘అంధాదున్’ రీమేక్ తోపాటు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ‘రంగ్ దే’ మూవీ చేయబోతున్నారు. త్వరలోనే ఈ రెండు చిత్రాలు పట్టాలెక్కనున్నాయి.

సంబంధిత వార్తలు