వినాయకుడి పెళ్లి.. నిర్భయ దోషుల ఉరి.. రేపే!

మార్చి 3న ఉదయం 6గంటలకు నిర్భయ దోషులను ఉరి తీయాలని కొత్త డెత్ వారెంట్ ను విడుదల చేస్తూ పాటియాలా కోర్ట్ సంచలన తీర్పును వెలువరించిన విషయం తెలిసందే.. అయితే గతంలో కూడా దోషుల ఉరికి అనేక పర్యాయాలు కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఆ శిక్ష అమలు కాలేదు. వాయిదాల మీద వాయిదాలు వేస్తూ.. కొత్త ఉరి కి డేట్ ఫిక్స్ చేయడం మరలా ఆ శిక్షకు స్టే విధించడం వంటివి అనేక పర్యాయాలు జరిగాయి.ఈ […]

  • Written By: Neelambaram
  • Published On:
వినాయకుడి పెళ్లి.. నిర్భయ దోషుల ఉరి.. రేపే!


మార్చి 3న ఉదయం 6గంటలకు నిర్భయ దోషులను ఉరి తీయాలని కొత్త డెత్ వారెంట్ ను విడుదల చేస్తూ పాటియాలా కోర్ట్ సంచలన తీర్పును వెలువరించిన విషయం తెలిసందే.. అయితే గతంలో కూడా దోషుల ఉరికి అనేక పర్యాయాలు కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఆ శిక్ష అమలు కాలేదు. వాయిదాల మీద వాయిదాలు వేస్తూ.. కొత్త ఉరి కి డేట్ ఫిక్స్ చేయడం మరలా ఆ శిక్షకు స్టే విధించడం వంటివి అనేక పర్యాయాలు జరిగాయి.ఈ నేపధ్యలో దోషులకు ఉరి అమలు కాదని నిందితుల తరుపు న్యాయవాది సంచలన వ్యాఖ్యలు చేశారు.

మర్చి 3 న అమలు కావాల్సిన ఉరి శిక్ష కూడా వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. జైలులో నిర్భయ దోషులు ఆడుతున్న నాటకాలే అందుకు కారణం. ఇప్పుడు కూడా మరో కొత్త నాటకానికి తెరలేపారు. దోషి వినయ్ శర్మ తీహార్ జైలులో హల్‌ చల్ చేశాడు. జైలులో గోడకు తలను గట్టిగా కొట్టుకొని.. తనను తాను గాయపరుచుకునే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న సిబ్బంది ఈ ఘటనను అడ్డుకున్నారు. ఈ క్రమంలో వినయ్‌ కు స్వల్ప గాయాలైనట్లు జైలు అధికారులు చెబుతున్నారు. ఉరి శిక్ష అమలులో మరోసారి ఉరికి స్టే రావాలనే ఉద్దేశంతో కావాలనే వినయ్ గాయపచుకున్నాడని.. జైలు అధికారులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు