Nipah Virus In Kerala: కరోనా తర్వాత భారత్ లో మరో మహమ్మారి.. ఇద్దరు మృతి
దేవుడి సొంత ప్రాంతంగా పేరు పొందిన కేరళ రాష్ట్రంలో నిపా అనే పేరుగ ల వైరస్ ప్రబలుతోంది. వైరస్ సోకడంతో ఇన్ఫెక్షన్ కారణంగా కోజి కోడ్ జిల్లాలో ఇద్దరు మృతిచెందారు.

Nipah Virus In Kerala: మొన్నటిదాకా కొవిడ్ వైరస్ తో అతలాకుతలమైన భారత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. ఇప్పటికీ ఇంకా చాలా వరకు వ్యవస్థలు గాడిన పడలేదు. కోవిడ్ బారిన పడిన వారిలో ఇప్పటికి చాలామంది ఏదో ఒక అనారోగ్య సమస్య తో బాధపడుతూనే ఉన్నారు. ఈ కోవిడ్ బాధ మర్చిపోకముందే దేశంలో మరో వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ వల్ల ఇద్దరు మృతి చెందడం ఆందోళనకు గురిచేస్తున్నది. ఈ వైరస్ కారణంగా మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను అత్యవసర విభాగంలో చేర్చారు.
దేవుడి సొంత ప్రాంతంగా పేరు పొందిన కేరళ రాష్ట్రంలో నిపా అనే పేరుగ ల వైరస్ ప్రబలుతోంది. వైరస్ సోకడంతో ఇన్ఫెక్షన్ కారణంగా కోజి కోడ్ జిల్లాలో ఇద్దరు మృతిచెందారు. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్యారోగశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కోజికోడ్ జిల్లాలోని కొన్ని కుటుంబాలకు చెందిన వారు ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. మొదట్లో జ్వరం భావించారు. కానీ వారి పరిస్థితి రోజురోజుకు దిగజారింది. చివరికి అత్యవసర విభాగంలో చికిత్స అందించినప్పటికీ వారి ప్రాణాలు దక్కలేదు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం వారు నిపా వైరస్ తో మృతి చెందినట్లు తెలుస్తోంది. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ అవసరంగా అధికారుల సమావేశం నిర్వహించారు. పరిస్థితిని సమీక్షించారు. నిపా వైరస్ తో ఇద్దరు మృతి చెందడం ఆ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. అయితే అదే ప్రైవేట్ ఆస్పత్రిలో ముగ్గురు చిన్నారులతోపాటు సహా మొత్తం నలుగురు రోగులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు కేరళ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. చనిపోయిన వారిలో ఒకరి బంధువు 22 ఏళ్ల వ్యక్తి ప్రస్తుతం ఆస్పత్రిలోని అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నాడు. అదేవిధంగా నాలుగు, తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న ఇద్దరు పిల్లలు, పది నెలల శిశువు కూడా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మృతి చెందిన ఇద్దరి నమూనాలను పూణేలోని ప్రయోగశాలకు పంపించారు. ఫలితాలు మంగళవారం సాయంత్రానికి వస్తాయి.
మరోవైపు నిపా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో కేరళ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుగా జన సమర్థ ప్రాంతాల్లో కచ్చితంగా మాస్కులు ధరించాలని సూచనలు జారీ చేశారు. నిపా వైరస్ మరణాలు చోటు చేసుకున్న ప్రైవేట్ ఆస్పత్రిలో శానిటేషన్ చేపట్టారు. అక్కడికి వచ్చే రోగులకు ప్రత్యేక ప్రజలలో చికిత్స అందిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో తొలిసారి నిపా కేసు మే 19, 2018 లో కోజికోడ్ జిల్లాలో బయటపడింది. ఈ వైరస్ కారణంగా 2018, 2021 లో మరణాలు నమోదయ్యాయి. పంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం జంతువుల నుంచి ప్రజలకు ఈ వైరస్ వ్యాపిస్తుంది. కలుషితమైన ఆహారం, ఈ వ్యాధి బారిన పాడిన వారి నుంచి ఇది నేరుగా మరొక వ్యక్తికి సంక్రమిస్తుంది. ఈ వైరస్ లక్షణాలు తొందరగా బయటపడవు. ఈ వైరస్ కొందరిలో మె ల్దడు వాపునకు కూడా కారణం అవుతుంది. ఒకసారి ఈ వైరస్ ఒంట్లోకి ప్రవేశించిన తర్వాత సాధారణంగా సంఘటన తొమ్మిది రోజుల్లో లేదా నాలుగు నుంచి పదిహేను రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి.
