Women’s World Boxing Championship 2023: బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్ షిప్: చివరి పంచ్ అదిరితే మనమే నంబర్ వన్
Women’s World Boxing Championship 2023: అద్భుతం.. అనితర సాధ్యం.. బీభత్సం.. ఇంకా చాలా కొలమానాలు. ఊహకు అందని ఉపోద్ఘాతాలు.. ఎన్ని రాసినా సరిపోవు. ఎందుకంటే సాధించిన విజయం అటువంటిది. నెలకొల్పిన ఘనత అటువంటిది. మహిళల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్ సెమీఫైనల్స్‌లో భారత బాక్సర్ల పంచ్ పవర్ అదిరిపోయింది. బరిలోకి దిగిన నలుగురూ తుదిపోరుకు అర్హత సాధించడంతో భారత్‌కు కనీసం నాలుగు రజత పతకాలు ఖాయమయ్యాయి. గురువారం జరిగిన ఈ సెమీ్‌సలో వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్ […]


Women’s World Boxing Championship 2023
Women’s World Boxing Championship 2023: అద్భుతం.. అనితర సాధ్యం.. బీభత్సం.. ఇంకా చాలా కొలమానాలు. ఊహకు అందని ఉపోద్ఘాతాలు.. ఎన్ని రాసినా సరిపోవు. ఎందుకంటే సాధించిన విజయం అటువంటిది. నెలకొల్పిన ఘనత అటువంటిది. మహిళల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్ సెమీఫైనల్స్‌లో భారత బాక్సర్ల పంచ్ పవర్ అదిరిపోయింది. బరిలోకి దిగిన నలుగురూ తుదిపోరుకు అర్హత సాధించడంతో భారత్‌కు కనీసం నాలుగు రజత పతకాలు ఖాయమయ్యాయి. గురువారం జరిగిన ఈ సెమీ్‌సలో వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్ (50 కేజీ) అంచనాలకు తగ్గట్టుగానే ఆడి వరుసగా రెండోసారి ఫైనల్లో ప్రవేశించింది. అలాగే 48 కేజీల నుంచి నీతు గాంగాస్, 75 కేజీల విభాగంలో ఒలింపిక్ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించగా..2014 తర్వాత సవీటి బోరా (81కేజీ) మరోసారి ఫైనల్ చేరింది.నిఖత్ సులువుగా: తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ సెమీస్ లో కొలంబియాకు చెందిన ఇన్‌గ్రిట్ వాలెన్సియాను 5-0 తేడాతో చిత్తుగా ఓడించింది.
వేగం, చురుకైన కదలిక
నిఖత్ పంచ్‌లోని వేగం, చురుకైన కదలికలతో కూడిన వ్యూహాత్మక ఆటతీరుకు రియో ఒలింపిక్స్ కాంస్య విజేత అయిన ప్రత్యర్థి ఏ మాత్రం నిలువలేకపోయింది. గతేడాది 52 కేజీల విభాగంలో విజేతగా నిలిచిన నిఖత్ ఈసారి కూడా విజేతగా నిలువాలనే పట్టుదలతో ఉంది. అంతకుముందు జరిగిన హోరాహోరీ సెమీస్ లో కామన్వెల్త్ చాంపియన్ నీతు 5-2తో అలువా బల్కిబెకోవా (కజకిస్థాన్)పై గెలిచింది. అయితే మూడు రౌండ్లలోనూ నీతూకు ఆసియా చాంపియన్ అయిన ప్రత్యర్థి సవాల్ విసిరింది. తొలిరౌండ్‌లో 2-3తో వెనుకబడినా, రెండో రౌండ్‌లో సరైన హుక్స్, జాబ్స్‌తో సమాధానమిస్తూ 4-1తో నిలిచింది. చివరి రౌండ్ ఉత్కంఠగా సాగగా ఆఖరికి రివ్యూ ద్వారా విజేతను తేల్చారు.

Women’s World Boxing Championship 2023
అలాగే గాయాల కారణంగా మూడుసార్లు రెఫరీ బౌట్‌ను ఆపాల్సి వచ్చింది. మరో సెమీ్‌సలో లవ్లీనా 4-1తో మాజీ చాంపియన్ లి క్వియాన్ (చైనా)ను ఓడించగా..ఆఖరి సెమీ్‌సలో సవీటి బూరా 81కేజీల విభాగంలో 4-3తో సూ ఎమ్రా గ్రీన్‌ట్రీ (ఆస్ట్రేలియా)ని ఓడించింది. ఫైనల్స్‌లో గుయెన్ తి టామ్ (వియ త్నాం)తో నిఖత్ జరీన్, కైక్లిన్ పార్కర్ (ఆస్ట్రేలి యా)తో లవ్లీనా, వాంగ్ లి నా (చైనా)తో సవీటి, లుక్సైఖాన్ (మంగోలియా)తో నీతు అమీతుమీ తేల్చుకోనున్నారు.
కఠినమైన శిక్షణ
ఈ ఛాంపియన్ షిప్ కు భారత బాక్సర్లు కఠినమైన శిక్షణ తీసుకున్నారు. ఒలంపిక్స్ ను దృష్టిలో పెట్టుకొని ఈ మెగా ఈవెంట్ కు సన్నద్ధమయ్యారు. నికత్ బృందం లోని మహిళా బాక్సర్లు విజయమో వీర స్వర్గమో అన్నట్టుగా కష్టపడ్డారు. ఆ కష్టానికి ప్రతిఫలం దక్కింది.. కేవలం ఒక్క అడుగు దూరంలోనే నిలిచింది.. ఫైనల్ మ్యాచ్ లోనూ ఇదే జోరు కొనసాగిస్తే భారత మహిళా బాక్సర్లకు ఇక తిరుగు ఉండదు..