Niharika Konidela: నేను నా భర్తని ఎప్పటికీ వదిలిపెట్టను..సోషల్ మీడియా కామెంట్స్ పట్టించుకోను : నిహారిక కొణిదెల
లేదని కూడా చెప్పుకొచ్చింది. అయితే వైవాహిక జీవితం గురించి ఇంత క్లారిటీతో సమాధానం చెప్పినా కూడా, సోషల్ మీడియా లో ఆమెపై రూమర్స్ ఆగుతాయో లేదో చూడాలి.

Niharika Konidela: సోషల్ మీడియా లో ఈమధ్య సెలెబ్రిటీల మీద రూమర్స్ హద్దులు దాటుతున్నాయి. ఎక్కువ వ్యూస్ వస్తే డబ్బులు బాగా వస్తున్నాయని చేతికి ఏది తోచితే అది రాసేస్తున్నారు గాసిప్ రాయుళ్లు. అందువల్ల సెలెబ్రిటీల జీవితాలు బాగా డిస్టర్బ్ అవుతున్నాయి. వాళ్ళు కూడా మనుషులే కదా, కొంతమంది సెలెబ్రిటీలు సోషల్ మీడియా లో వచ్చే గాసిప్స్ పెద్దగా పట్టించుకోకపోయినా, కొంతమంది మాత్రం చాలా సీరియస్ గా తీసుకొని పోలీస్ కంప్లైంట్స్ ఇచ్చిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.
రీసెంట్ గా మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల తన భర్త చైతన్య తో విడిపోయినట్టు. వీళ్లిద్దరు గత ఆరు నెలల నుండి విడివిడిగా ఉన్నట్టు, నిహారిక రెండవ పెళ్ళికి కూడా సిద్ధం అయిపోయినట్టు. ఇలా ఎన్నో వార్తలు వచ్చాయి. దీనిపై నిహారిక కానీ, మెగా ఫ్యామిలీ కుటుంబీకులు కానీ ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. అయితే నిహారిక చాలా కాలం తర్వాత ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఈ ఇంటర్వ్యూ లో నిహారిక వివిధ ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానం చెప్పింది. అందులో కొన్ని హైలైట్స్ ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా ఆమె మాట్లాడుతూ ‘సినిమాలకు నేను గుడ్ బాయ్ చెప్పలేదు, అవకాశాలు వస్తే కచ్చితంగా నటిస్తాను. సోషల్ మీడియా వచ్చే రూమర్స్ మరియు నెగటివ్ కామెంట్స్ చూసి అప్పట్లో బాధపడేదానిని, కానీ ఇప్పుడు పట్టించుకోవడం మానేసాను. ఈమధ్య కూడా నా వైవాహిక జీవితం పై ఎన్నో రూమర్స్ ప్రచారం చేసాడు, అందులో ఎలాంటి నిజం లేదు. కనీసం స్పందించాలని కూడా నాకు లేదు, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను’ అంటూ నిహారిక కొణిదెల ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.
అంతే కాకుండా పుష్ప 2 నేను నటిస్తున్నట్టు చాలా వార్తలు వచ్చాయి, అందులో ఎలాంటి నిజం లేదని కూడా చెప్పుకొచ్చింది. అయితే వైవాహిక జీవితం గురించి ఇంత క్లారిటీతో సమాధానం చెప్పినా కూడా, సోషల్ మీడియా లో ఆమెపై రూమర్స్ ఆగుతాయో లేదో చూడాలి.
