Tollywood Review : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు సమ్మర్ వచ్చిందంటే చాలు సినిమాల పండుగ మొదలయ్యేది…కానీ ఈ సంవత్సరం స్టార్ హీరోల నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు…స్టార్ హీరోలందరు సమ్మర్ ను లైట్ తీసుకున్నారు. ఏది ఏమైనా కూడా ఇప్పుడిప్పుడే పాన్ ఇండియాలో మన సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తున్న క్రమంలో let చేయకుండా మరోసారి పాన్ ఇండియాలో తెలుగు సినిమాల హవా చూపించాల్సిన సమయమైతే ఆసన్నమైంది…
మే నెలలో పెద్ద సినిమాలు ఏమీ రానప్పటికి వచ్చిన సినిమాలు సైతం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాయి. నిజానికి ఈ సమ్మర్ లో స్టార్ హీరోల సినిమా ఒక్కటి కూడా రాకపోవడం సగటు ప్రేక్షకులందరికీ నిరాశకు గురిచేసిందనే చెప్పాలి. ఇక మే 1వ తేదీన నాని హీరోగా శైలేష్ కొలన్ (Shailesh Kolen) దర్శకత్వంలో వచ్చిన హిట్ 3 (Hit 3) సినిమా ఆశించిన మేరకు విజయాన్ని అయితే సాధించలేదు. పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నప్పటికి నాని రేంజ్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోలేకపోయింది. యూఎస్ లో ఈ సినిమాకి కొంతవరకు ప్రేక్షకాదరణ దక్కినప్పటికి తెలుగులో మాత్రం సో సో గానే ఆడింది…
మే 9వ తేదీన శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘సింగిల్’ (Single) సినిమా రిలీజ్ అయింది. ఇక సమంత నిర్మించిన ‘శుభం’ (Shubham) సినిమా కూడా అదే రోజున రిలీజ్ అయింది. అయితే ఈ రెండు సినిమాల్లో సింగిల్ మూవీ కొంతవరకు పర్లేదు అనిపించుకున్నప్పటికి శుభం మాత్రం నెగెటివ్ టాక్ ను సంపాదించుకుంది. మరి ఏది ఏమైనా కూడా ఈ రెండు సినిమాలు కూడా పెద్దగా ఆదరణ అయితే పొందలేకపోయాయి…
ఈనెలలోనే 23 సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మల్లేశం సినిమాతో మంచి దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్న రాజ్ ఈ సినిమాని తీయడం విశేషం…ఈ సినిమా సోషల్ అవేర్నెస్ ను బేస్ చేసుకొని వచ్చింది. ఈ సినిమా కొంతవరకు పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నప్పటికి కమర్షియల్ గా మాత్రం సక్సెస్ సాధించలేకపోయింది.
ఇక మే చివరి వారంలో ‘భైరవం’ (Bhairavam), షష్టిపూర్తి (Shastipurthi) సినిమాలు వచ్చాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో వచ్చిన భైరవం మూవీ రొటీన్ కథతో వచ్చింది. అలాగే దర్శకత్వం కూడా అంత పెద్ద ఎఫెక్టివ్ గా లేదనే ఉద్దేశ్యంతో ఈ సినిమాని ప్రేక్షకులు లైట్ తీసుకుంటున్నారు.మొత్తానికైతే ఈ సినిమా బిలో ఆవరేజ్ టాక్ ను సంపాదించుకొని ముందుకు సాగుతోంది. ఇక రాజేంద్రప్రసాద్, అర్చన కీలకపాత్రలో వచ్చిన సినిమా షష్టిపూర్తి… ఈ మూవీ మొదటి షో తోనే తేలిపోయింది…
మొత్తానికైతే ఈ మే నెలలో హీరోగా వచ్చిన హిట్ 3 మూవీ అలాగే శ్రీ విష్ణు హీరోగా వచ్చిన సింగిల్ సినిమాలు కొంతవరకు పర్లేదు అనిపించాయి… ఈ సంవత్సరం ఫస్టాఫ్ లో పెద్దగా స్టార్ హీరోలైతే రాలేదు. సెకండ్ హాఫ్ లో అయినా స్టార్ హీరోలు వచ్చి వాళ్ళ హవాను చూపించి పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను సాధిస్తారా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…