Peddi vs Paradise: ఆడియన్స్ లో గ్లింప్స్ విదేవులతోనే విపరీతమైన అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రాలు ‘పెద్ది'(Peddi Movie), ‘ది ప్యారడైజ్'(The Paradise). రామ్ చరణ్(Global Star Ram Charan) ‘పెద్ది’ లీగ్ వేరే. రీసెంట్ గా ఈ చిత్రం నుండి విడుదలైన ‘చికిరి చికిరి’ పాట గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ సృష్టించింది. ఈ సినిమాపై ఎవ్వరూ ఊహించనంత హైప్ ని పెంచింది. అంతకు ముందు కేవలం రామ్ చరణ్ అభిమానులు, మెగా అభిమానులు మాత్రమే ఈ సినిమా కోసం ఎదురు చూసేవాళ్ళు , ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. ఇక నాని(Natural Star Nani) హీరో గా నటిస్తున్న ‘ ది ప్యారడైజ్’ విషయానికి వస్తే, ఈ చిత్రానికి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. గతం లో నాని తో ‘దసరా’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించాడు శ్రీకాంత్. అందుకే ఈ సినిమా పై మొదటి నుండి మంచి హైప్ ఉంది, అదే విధంగా ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్ వీడియో కూడా ఆడియన్స్ ని ప్రత్యేకంగా ఆకట్టుకుంది.
హీరో నాని గెటప్, ఆయన క్యారెక్టర్ పేరు కూడా వెరైటీ గా అనిపించాయి. అన్ని విధాలుగా ఈ సినిమా కొత్త తరహా చిత్రం లాగా ఉంది, ఆడియన్స్ కి ఒక సరికొత్త థియేట్రికల్ అనుభూతి ఇవ్వబోతుందని ఒక ఫీలింగ్ ని కలిగించింది. ఈ రెండు సినిమాలు పక్క పక్కనే విడుదల అవ్వబోతున్నాయని ఇన్ని రోజులు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తూ వచ్చిన వార్త. ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని మార్చి 26న విడుదల చేయాలనీ మేకర్స్ అనుకుంటుండగా, మరో పక్క రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రాన్ని మార్చి 27 న విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఈ రెండు సినిమాలు విడుదల తేదీలను మార్చలేదు. అయితే రీసెంట్ గా ‘ది ప్యారడైజ్’ మూవీ నిర్మాతల్లో ఒకరైన చెరుకూరి సుధాకర్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘తప్పనిసరి పరిస్థితులు ఉంటే తప్ప , ఇండస్ట్రీ లో ఎవరూ కూడా రెండు పెద్ద సినిమాలు క్లాష్ లో రావాలని కోరుకోరు. అలా వస్తే నష్టాలు తప్ప మిగిలేదు ఏమి లేదు. రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం మార్చి 27 న కచ్చితంగా విడుదల అవ్వాలని అనుకుంటే, మేము మా చిత్రాన్ని వాయిదా’ వేసుకుంటాము అని చెప్పుకొచ్చాడు. అయితే వాస్తవం ఏమిటంటే ఈ రెండు సినిమాలకు మార్చి నెలలో వచ్చేంత స్కోప్ లేదు. ఎందుకంటే రెండు సినిమాలకు కూడా షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉంది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే ఈ రెండు సినిమాలకు బదులుగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
