Odi World Cup 2023: డీలాపడ్డ న్యూజిలాండ్, పుంజుకున్న ఆస్ట్రేలియా, జోరు తగ్గని దక్షిణాఫ్రికా…

రీసెంట్ గా సౌతాఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో అయితే దారుణంగా ఓడిపోయి రన్ రేట్ ని కూడా చాలావరకు కోల్పోవాల్సి వచ్చింది. సౌతాఫ్రికా మీద 190 పరుగుల తేడా తో ఓడిపోయి ఈ టోర్నీలో న్యూజిలాండ్ అత్యంత ఘోరంగా ఓడిపోయిన మ్యాచ్ గా ఒక బ్యాడ్ రికార్డ్ ని కూడా సంపాదించుకుంది..

  • Written By: Gopi
  • Published On:
Odi World Cup 2023: డీలాపడ్డ న్యూజిలాండ్, పుంజుకున్న ఆస్ట్రేలియా, జోరు తగ్గని దక్షిణాఫ్రికా…

Odi World Cup 2023: 2023 వరల్డ్ కప్ లో భాగంగా అన్ని దేశాల టీములు ఆడుతున్న ప్రతి మ్యాచ్ కూడా రోజుకి ఒక ట్విస్ట్ తో మ్యాచ్ చూసే అభిమానులకి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఒకరోజు ఒక టీమ్ టాప్ పొజిషన్ లో ఉంటే మరొక రోజు మరో టీమ్ వచ్చి టాప్ పొజిషన్ ని దక్కించుకుంటుంది. ఇక ఇలాంటి క్రమంలో ఈ టోర్నీ స్టార్టింగ్ లో న్యూజిలాండ్ టీమ్ వరుసగా నాలుగు విజయాలను అందుకొని అందరిని ఆశ్చర్యపరుస్తూ ఈ టోర్నీ లో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగింది.ఇక న్యూజిలాండ్ టీమ్ వరుసగా ఇండియా ,ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా టీమ్ ల మీద ఓడిపోవడం తో ప్రస్తుతం సెమీస్ కి వెళ్లడానికి కూడా కొద్దిగా కష్టపడాల్సిన పరిస్థితుల్లో ఉంది.ఇక ఈ టోర్నీ మొదట్లో న్యూజిలాండ్ టీమ్ ని చూసిన ప్రపంచ క్రికెట్ మేధావులు సైతం ఈసారి న్యూజిలాండ్ కప్పుకొట్టబోతుంది అంటూ జోష్యం చెప్పారు. అయితే ఇండియా మీద ఆడిన మ్యాచ్ లో న్యూజిలాండ్ కి మొదటి ఓటమి ఎదురైంది ఇక అప్పటి నుంచి వరుసగా ఓడిపోతూ వస్తుంది.

ఇక రీసెంట్ గా సౌతాఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో అయితే దారుణంగా ఓడిపోయి రన్ రేట్ ని కూడా చాలావరకు కోల్పోవాల్సి వచ్చింది. సౌతాఫ్రికా మీద 190 పరుగుల తేడా తో ఓడిపోయి ఈ టోర్నీలో న్యూజిలాండ్ అత్యంత ఘోరంగా ఓడిపోయిన మ్యాచ్ గా ఒక బ్యాడ్ రికార్డ్ ని కూడా సంపాదించుకుంది… అయితే న్యూజిలాండ్ వరుస ఫెయిల్యూర్ కి కారణం వాళ్ళు ఆపోజిట్ టీమ్ ని కానీ, ఆ మ్యాచ్ ని కానీ కరెక్ట్ గా జడ్జ్ చేయలేకపోతున్నారు. అందువల్లే వాళ్ళకి వరుస ఓటములు వస్తున్నాయి ఇప్పటికైన వాళ్ళు వాళ్ల తప్పులను తెలుసుకుంటే మంచి విజయాలు వస్తాయి లేకపోతే వాళ్ళు సెమీస్ కి రావడం చాలా కష్టం అవుతుంది…

ఇక మొదటి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి సెమీస్ రేస్ లో అసలు లేకుండా పోయిన ఆస్ట్రేలియన్ టీమ్ అనతి కాలంలోనే వాళ్ల ఫెయిల్యూర్స్ ని తెలుసుకొని పుంజుకుంటూ వరుస విజయాలను అందుకుంటూ ఒక్కొక్క టీం ని దాటుకుంటూ ఇప్పుడు పాయింట్స్ టేబుల్ లో నెంబర్ త్రీ పొజిషన్ కి చేరుకుంది.ఇక ముందు ఆడబోయే మ్యాచ్ ల్లో కూడా తమదైన రీతిలో విజయాలను సాధించి సెమీస్ కి వెళ్లాలని ఆస్ట్రేలియన్ టీమ్ చాలా ఆరాటపడుతుంది…

ముఖ్యంగా ఆస్ట్రేలియన్ టీం లో ఉన్న వార్నర్ ఆ టీం కి పెద్ద ప్లస్ పాయింట్ గా మారాడు. ఎందుకంటే వరుసగా సంచలన రీతి లో బ్యాటింగ్ చేస్తూ టీమ్ భారీ స్కోర్ చేయడంలో తన వంతు కృషి చేస్తున్నాడు. అలాగే టీం ని విజయ తీరాలకు చేర్చడంలో తను కీలకపాత్ర వహిస్తున్నాడు ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ కి వస్తే ఆడమ్ జంపా అద్భుతమైన బౌలింగ్ చేస్తూ తనదైన రీతిలో టీమ్ కి విజయాలను అందిస్తున్నాడు.ఇక ఆస్ట్రేలియా టీమ్ రెండు వరుస ఓటముల తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో గెలవడం అంటే మామూలు విషయం కాదు. మొదటి రెండు మ్యాచ్ ల్లో డీలాపడినప్పటికీ అంతలోనే ఇంత వేరియేషన్స్ ని చూపిస్తూ ఆస్ట్రేలియా టీమ్ మ్యాచ్ గెలవడం అనేది ఆ టీం గ్రేట్ నెస్ అనే చెప్పాలి. మొదట్లో అందరూ కూడా ఆస్ట్రేలియా టీమ్ పని అయిపోయింది అనే వ్యాఖ్యలను చేశారు. కానీ వాళ్ళందరి ఊహలను తలకిందులు చేస్తూ ఆస్ట్రేలియా ప్రస్తుతం నెంబర్ త్రీ పొజిషన్ కి చేరుకుంది…

ఇక సౌతాఫ్రికా టీమ్ విషయానికొస్తే సౌతాఫ్రికా మొదట మంచి విజయాలను అందుకుంది.కానీ మధ్యలో పసి కూన అయిన నెదర్లాండ్స్ చేతిలో ఘోర పరాజయాన్ని చెవి చూసింది. అప్పుడు సౌతాఫ్రికా చాలా విమర్శలను ఎదురుకున్నప్పటికి ఆ తర్వాత ఆడిన మ్యాచ్ ల్లో మంచి విజయాలను సాధిస్తూ ప్రస్తుతం ఏడు మ్యాచులు ఆడితే అందులో ఆరు విజయాలను సాధించి ఇండియన్ టీమ్ ని వెనక్కి నెట్టి పాయింట్స్ టేబుల్ లో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది. ఇక సౌతాఫ్రికా టీం భారీ విజయాలను అందుకోవడం లో ఆ టీమ్ ప్లేయర్లు అయిన డికాక్, వండర్ డసెన్ ,మహారాజ్ లాంటి ప్లేయర్లు కీలకపాత్ర వహిస్తున్నారు…

ఇక సెమీస్ రేస్ లో ఈ మూడు టీములు కూడా అత్యంత కీలకపాత్రలను వహిస్తూ ముందుకు వెళ్తున్నాయి.ఇక ఈ క్రమం లో ఒక్కొక్క మ్యాచ్ ఒక్కోలా మారుతుంది.ఇక మొత్తం మ్యాచులు గడిస్తే తప్ప వీటిలో ఏ టీమ్ సెమీస్ కి వెళ్తుంది అనేది చెప్పడం కష్టంగా మారింది.. ఇక ఇప్పటికే వీటికి పోటీగా పాకిస్తాన్ టీం కూడా వస్తుంది పాకిస్థాన్ రీసెంట్ గా బంగ్లాదేశ్ ని చిత్తు చేసి పాయింట్స్ టేబుల్.లో నెంబర్ 5 పొజిషన్ లో కొనసాగుతుంది…

Read Today's Latest Sports news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు