New Virus Arriving: కోవిడ్ మహమ్మారి నుంచి దేశం ఇప్పుడిప్పుడే ఉపశమనం పొందుతోంది. కరోనా విపత్తు నుంచి కుదేలైన అనేక రంగాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ క్రమంలో మరో ముప్పు మంచుకొస్తోంది. దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అదే టమాటో ఫ్లూ.!
Tomato Flu
దేశంలో కొన్ని రోజులుగా టమాటో ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. మొదట ఈ వైరస్ కేరళ రాష్ట్రంలో బయట పడింది. ప్రస్తుతం తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకూ విస్తరించింది. ఐదేళ్లలోపు చిన్నారులే ఈ వైరస్‌బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖలు చిన్నారుకు సోకుతున్న ఫ్లూపై దృష్టిపెడుతున్నాయి. జ్వర పీడితులకు రక్త పరీక్షలు చేస్తున్నాయి.
ఐదేళ్లలోపు వారిపైనే అటాక్..
Tomato Fever
ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం టమాటో ఫ్లూ ఎక్కువగా ఐదేళ్లలోపు ఉన్న పిల్లలకే ఎక్కువగా సోకుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిని ఇది ఎక్కువగా టార్గెట్ చేస్తుంది. టమాటో ఫ్లూ అంటు వ్యాధని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే మూడు రాష్ట్రాలకు వ్యాప్తి చెందిన వైరస్ రాబోయే రోజుల్లో మరిన్ని రాష్ట్రాలకు విస్తరిస్తుందని పేర్కొంటున్నారు. పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని హెచ్చరిస్తున్నారు.
ఇదీ ఒక వైరసే..
న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని పీడియాట్రిక్స్ అండ్ ప్రివెన్షన్ విభాగానికి చెందిన డాక్టర్ అమోల్‌కుమార్‌లోకాడే టమాటో ఫ్లూ గురించి వెల్లడించారు. ఈ వైరస్ సోకడానికి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన కారణాలు దొరకలేదని తెలిపారు. ఏవో వైరస్ కారణంగా మాత్రమే ఇది సోకుతున్నట్లు గుర్తించామని తెలిపారు. చికెన్, స్మాల్ పాక్స్‌లాగానే టమాటో ఫ్లూ కూడా ఉంటుందని పేర్కొన్నారు. పిల్లలకు ఎక్కుగా సోకుతుందని, ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని వెల్లడించారు. పిల్లులు జ్వరంతో బాధపడుతున్నట్లయితే వారికి సొంతంగా మందులు ఇవ్వకుండా వైద్యులను సంప్రదించాలి. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయితే ఆందోళన చెందకుండా చికిత్స చేయించాలని తెలిపారు.
Also Read: Nandamuri Balakrishna Became A Producer: నిర్మాతగా మారిన నందమూరి బాలకృష్ణ.. తొలి సినిమా ఆ హీరోతో??
ఇవీ లక్షణాలు..
– పిల్లలకు జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, డీహైడ్రేషన్ ఉంటే, ఇతర పిల్లల నుంచి వేరుగా ఉంచాలి.
– పిల్లలకు జ్వరం మూడు నుంచి ఐదు రోజులపాటు కొనసాగితే పరీక్ష చేయించాలి.
– టమాటో ఫ్లూ సోకితే మొదట వరం వస్తుంది. తర్వాత శరీరంపై ఎరుపు రంగు దద్దుర్లు వస్తాయి. వీటిని ముట్టుకోవద్దు.
– ఈ ఫ్లూ పిల్లల శరీరంలో ఏడు నుంచి 14 రోజులపాటు ఉంటుంది. ఈ సమయంలో పిల్లలకు వాంతులు, విరేనాలు కూడా అయ్యే అవకాశం ఉంది.
– ఫ్లూ నివారణకు ఇంట్లో శుభ్రతపై శ్రద్దపెట్టాలి. పిల్లల శరీరంలో నీటి కొరత ఉండనివ్వొద్దు, ఇంట్లో ఎవరికైనా జ్వరం వస్తే పిల్లలను దూరంగా ఉంచాలి. టమాటో ఫ్లూ లక్షణాలు కనిపిస్తే మొదట వైద్యులను సంప్రదించాలి.
Also Read: kangana Ranaut: అయ్యో కంగనా, మరీ ఇంత దారుణమా ! దేశమంతా కలిపి ఇరవై టికెట్లేనా !!!!
Recommended Video: