New PRC: ఏపీ సర్కారు తాజాగా ప్రకటించిన కొత్త పీఆర్సీతో ఉద్యోగులకు సరికొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు సమ్మె బాట పడుతున్నారు. కాగా, ఈ పీఆర్సీ వలన ఉద్యోగులు ఇప్పటికే తీసుకున్న డబ్బులను భవిష్యత్తులో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అలా రూ.లక్షకు పైగా అధికారులు కోల్పోనున్నారు. సూపరింటెండెంట్ కేడర్ తోని ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులు చాలా మంది రూ.వేలల్లో మనీ తిరిగి వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయం తెలుసుకుని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

New PRC
ఉద్యోగుల ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇకపోతే డీఏ అనగా డియర్ నెస్ అలవెన్స్ (కరువు భత్యం) బకాయిల రూపంలో వసూలు చేయనుంది సర్కారు. ఇందుకుగాను ఏపీ సర్కారు పక్కాగా ఉత్తర్వులు కూడా ఇచ్చింది. అలా సర్కారు ఇచ్చిన 11వ పీఆర్సీ అమలు ఫిట్ మెంట్, హెచ్ఆర్ ఏ తదితర అంశాలు, విధి విధానాలపైన ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నూతన పీఆర్సీతో ఫిట్ మెంట్ 23 శాతానికి తగ్గింది. హెచ్ ఆర్ ఏ శ్లాబులన్నీ కూడా మారిపోయాయి. దాంతో పాటు సీసీఏ(సిటీ కాంపన్సేటరీ అలవెన్సు) కూడా తొలగించింది సర్కారు. దాంతో ఉద్యోగులకు తీవ్రస్థాయిలో నష్టం కలగనుంది. మొత్తంగా ఏపీ సర్కారు ఉద్యోగులను మోసం చేసిందని ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
Also Read: PRC Issue: ఏపీ ఉద్యోగుల ఆశలు ఆవిరి.. సీఎం జగన్ కోర్టులోకి బంతి..!
ఏపీ సర్కారు తాజాగా ఇచ్చిన పీఆర్సీ ఉత్తర్వుల ప్రకారం.. ఉద్యోగులు తిరిగి డబ్బులను వెనక్కు చెల్లించాల్సి ఉంటుంది. కొత్త వేతన స్కేల్స్ ప్రకారం.. డబ్బులు వెనక్కు ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తంగా తాజా వేతన సవరణతో ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బంది పెట్టదల్చుచకున్నదనే విషయం స్పష్టమవుతోంది. రూ.వేల నుంచి మొదలుకుని లక్ష వరకు డబ్బులను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 17న ఏపీ సర్కారు ఇచ్చిన జీవోతో ఉద్యోగులకు విపరీతమైన నష్టం అయితే కలగనుంది. ఉద్యోగులు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని శాఖల ఉద్యోగులు కలిసి సకల జనుల సమ్మె చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, సమ్మె పట్ల ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది కూడా కీలకంగా మారనుంది. చూడాలి ఏం జరుగుతుందో..
Also Read: PRC: ఏపీలో ఎటూ తేలని PRC పంచాయితీ.. సీఎంవో చుట్టూ ఉద్యోగ సంఘాల ప్రదక్షిణలు