Whatsapp New Features : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్లు.. అందరికీ ఉపయోగపడే అదిరిపోయే అప్‌డేట్ ఇదే!
ఈ ఇన్‌స్టంట్ మేసేజ్ యాప్ ద్వారా మెసేజ్‌లు, వీడియోలు, ఫొటోలు, ఆడియో ఫైల్స్, ఇతర ఫైల్స్ కూడా పంపే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది ఈ యాప్‌ను ఇష్టపడుతున్నారు. దీంతో వినియోగదారులను ఆకట్టుకోడానికి వాట్సాప్ కూడా కొత్త అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇస్తుంది.

Whatsapp New Features : ఇటీవల వాట్సాప్ యువతను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ఈ ఇన్‌స్టంట్ మేసేజ్ యాప్ ద్వారా మెసేజ్‌లు, వీడియోలు, ఫొటోలు, ఆడియో ఫైల్స్, ఇతర ఫైల్స్ కూడా పంపే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది ఈ యాప్‌ను ఇష్టపడుతున్నారు. దీంతో వినియోగదారులను ఆకట్టుకోడానికి వాట్సాప్ కూడా కొత్త అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇస్తుంది. సరికొత్త ఫీచర్ తీసుకువస్తోంది. తాజాగా ఓ కొత్త అప్‌డేట్‌ను ఇచ్చింది.
వీడియో నిడివి పెంపు…
తాజాగా వాట్సాప్ కెమెరా ద్వారా రికార్డ్ చేసే వీడియోల పరిధిని పెంచింది. కొత్త ఫీచర్‌తో 60 సెకన్ల వరకూ వీడియోలను రికార్డ్ చేసి షేర్ చేయవచ్చు. ఇది ఆండ్రాయిడ్, ఐవోఎస్ బీటా యూజర్లకు అందుబాటులోకి రాగా.. యూజర్లు కొత్త వర్షన్ను డౌన్లోడ్ చేసుకుంటే మరికొద్ది రోజుల్లో అందరికీ అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు వీడియో రికార్డు నిడివి 45 సెకన్లు మాత్రమే ఉంది. తాజాగా దానిని మరో 15 సెకన్లు పొడిగింది.
ఇటీవల కొన్ని ఫీచర్లు..
ఇప్పటికే మెసేజ్ ఎడిట్, చాట్ లాక్ వంటి ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్ ఇటీవల జూమ్, గూగుల్ మీట్ తరహాలో వీడియో కాలింగ్ లో స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ తీసుకువచ్చింది. ఈ ఫీచర్ తో స్క్రీన్ అడుగు భాగంలో కొత్తగా షేరింగ్ బటన్ క్లిక్ చేస్తే మీ స్క్రీన్ ఇతరులకు షేర్ చెయ్యొచ్చు.
ఫొటోల పరిమితి పెంపు..
వాట్సాప్ ద్వారా మొన్నటి వరకు గరిష్టంగా 30 ఫొటోలను పంపే అవకాశం ఉంది. ఇప్పుడు దాన్ని వంద ఫొటోలు పంపేలా అప్‌డేట్ చేశారు. అలాగే వీడియోలను అదే స్థాయిలో పంపే అవకాశం ఉంది. ఈ అప్‌డేట్ ఫొటోలు షేర్ చేసే వారికి కచ్చితంగా ఉపయోగపడుతుంది.
డాక్యుమెంట్‌కు క్యాప్షన్
గ్రూప్ లేదా చాట్‌లో డాక్యుమెంట్ షేర్ చేసే సమయంలో ఎలాంటి క్యాప్షన్ జత చేసే అవకాశం గతంలో ఉండేది కాదు. ఇప్పుడు డాక్యుమెంట్స్‌కు కూడా కాప్షన్ జోడిండే అవకాశం కల్పించింది.
