Whatsapp New Feature: వాట్సాప్ మనకు ఎన్నో అద్భుతాలు కల్పిస్తోంది. ఇప్పటికే ఎన్నో మార్పులు చేస్తూ వినియోగదారులకు సదుపాయాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా మరిన్ని చర్యలు తీసుకుంటోంది. నిరంతరం వినియోగదారుల శ్రేయస్సే ప్రధానంగా ముందుకు సాగుతోంది. ఎన్నో ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొస్తూ నిత్యం వినూత్న పోకడలకు శ్రీకారం చుడుతోంది. ఈ నేపథ్యంలో మరో ఫీచర్ కు కసరత్తు చేస్తోంది. వాట్సాప్ లో మరిన్ని సేవలు పొందడానికి వీలు కల్పిస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకుంటోంది. ఫలితంగా ఎన్నో రకాలుగా సేవలందించేందుకు సిద్ధపడుతోంది.

Whatsapp New Feature
తాజాగా వాట్సాప్ లో మన సందేశాలు మనమే పంపించుకునే విధంగా ప్రయత్నిస్తోంది. ఈ ఫీచర్ తో నోట్స్, రిమైండర్స్, షాపింగ్ లిస్ట్ రాసుకునే విధంగా ప్రణాళికలు రచిస్తోంది. దీని కోసం మనం చాట్ మెసేజ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే కాంటాక్ట్ లిస్ట్ వస్తుంది. అక్కడ బ్రాకెట్ లో YOU అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే సెల్ఫ్ మెసేజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ కొంత మందికి అందుబాటులో ఉంది. మరో వారం రోజుల్లో అందరికి అందుబాటులోకి రానుంది. దీంతో వాట్సాప్ తో మనకు ఎంతో లాభం ఉంటుంది.
ఇక మీదట పెన్ను, పేపర్ అవసరం ఉండదు. వాట్సాప్ లో మనకు కావాల్సిన సమాచారాన్ని మనమే టైపు చేసుకుని తరువాత దాన్ని భద్రంగా ఉంచుకోవచ్చు. లేదంటే ఎవరికైనా పంపించుకోవచ్చు. ఇలాంటి సదుపాయాలతో వాట్సాప్ కొత్త పద్ధతులు చేపడుతోంది. ఫలితంగా వినియోగదారులకు మరింత చేరువ అవుతోంది. అన్ని పనులు మొబైల్ లోనే చేసుకునేలా వెసులుబాటు కల్పించడం గమనార్హం. ఈ నేపథ్యంలో భవిష్యత్ లో వాట్సాప్ మరిన్ని పథకాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Whatsapp New Feature
వాట్సాప్ మరిన్ని అవసరమయ్యే సేవలను అందుబాటులోకి తీసుకురానుందని చెబుతున్నారు. ప్రజలకు సులభంగా పనులు అయ్యే కోణంలో ఆలోచిస్తూ మరింత ముందుకు వెళ్తోంది. ఇందుకు గాను పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. వినియోగదారుల సేవల కోసం నిరంతరం కొత్తదైన ఆలోచనలు చేస్తోంది. దీంతో మనకు మరిన్ని సేవలు అందనున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మంది వినియోగించే సామాజిక మాధ్యమాల్లో వాట్సాప్ ఒకటిగా నిలుస్తోంది. రాబోయే కాలంలో మరిన్ని ఫీచర్స్ అందుబాటులోకి తీసుకురానుందని పలువురు చెబుతున్నారు.