Varun Lavanya Marriage: హల్దీ వేడుకలో మెరిసిన నూతన జంట వరుణ్-లావణ్య… వైరల్ అవుతున్న ఫోటోలు!
మంగళవారం హల్దీ వేడుకలు నిర్వహించారు. దీని కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తుల్లో నూతన వధూవరులు మెరిశారు. వరుణ్ తేజ్… పసుపు రంగు కుర్తా, తెల్ల ప్యాంటు ధరించారు.

Varun Lavanya Marriage: కొణిదెల వారి ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఇటలీ వేడుకగా వివాహ వేడుకల్లో మునిగి తేలుతున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమ వివాహం చేసుకుంటున్న విషయం తెలిసిందే. నవంబర్ 1న పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు. గత రెండు రోజులుగా పెళ్లి వేడుకలు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి కాక్ టైల్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి వరుణ్ తేజ్ సిల్వర్ కలర్ టక్సేడో సూట్ ధరించారు. లావణ్య సిల్వర్ కలర్ గౌన్ ధరించారు. మెగా హీరోలు కూడా టిప్ టాప్ గా తయారయ్యారు.
ఇక మంగళవారం హల్దీ వేడుకలు నిర్వహించారు. దీని కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తుల్లో నూతన వధూవరులు మెరిశారు. వరుణ్ తేజ్… పసుపు రంగు కుర్తా, తెల్ల ప్యాంటు ధరించారు. లావణ్య ఎల్లో కలర్ లెహంగాలో సిద్ధమైంది. వరుణ్, లావణ్య కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ వేడుకలు ఘనంగా చేశారు. చిరంజీవి దంపతులు ఆశీర్వదించారు. వరుణ్-లావణ్యల హల్దీ వేడుకల ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Varun Lavanya Marriage
నేడు ఘనంగా వివాహం జరగనుంది. పెళ్ళికి కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఒకరిద్దరు చిత్ర ప్రముఖులు మినహాయిస్తే… ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే ఆహ్వానం దక్కింది. ఇటలీ నుండి వచ్చాక నవంబర్ 5న హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. రిసెప్షన్ కి చిత్ర, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారట. మెగా ఫ్యామిలీలో చోటు చేసుకున్న ఈ వివాహం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది.

Varun Lavanya Marriage
2017లో మిస్టర్ మూవీలో వరుణ్-లావణ్య జతకట్టారు. అప్పుడే వీరి ప్రేమ మొదలైంది. అనంతరం అంతరిక్షం చిత్రంలో మరోసారి కలిసి నటించారు. వీరి ప్రేమ వ్యవహారం చాలా కాలం గోప్యంగా సాగింది. రెండేళ్ల క్రితం పుకార్లు రేగాయి. అప్పుడు కూడా తాము స్నేహితులమే అంటూ ఎఫైర్ రూమర్స్ ఖండించారు. సడన్ గా నిశ్చితార్థం ప్రకటన చేసి షాక్ ఇచ్చారు. జూన్ 9న హైదరాబాద్ లోని నాగబాబు నివాసంలో లావణ్య-వరుణ్ ల ఎంగేజ్మెంట్ జరిగింది. తమ ప్రేమను పెళ్లి బంధంతో శాశ్వతం చేసుకున్నారు. ఈ వివాహానికి పవన్ , రామ్ చరణ్, అల్లు అర్జున్ సతీసమేతంగా హాజరయ్యారు.
View this post on Instagram
