Swara Bhaskar: అన్నయ్యను పెళ్లి చేసుకున్న హీరోయిన్!
Swara Bhaskar: పెళ్లితో కూడా కాంట్రవర్సీ రాజేసింది హీరోయిన్ స్వర భాస్కర్. సమాజ్ వాదీ పార్టీ నేత, సోషల్ యాక్టివిస్ట్ ఫహద్ జరార్ అహ్మద్ తో స్వర వివాహం వివాదాస్పదం అవుతుంది. జనవరి 6న స్వర భాస్కర్-ఫహద్ వివాహం జరిగింది. ఈ విషయాన్ని స్వర ఫిబ్రవరి 16న బయటపెట్టింది. తనకు వివాహం జరిగినట్లు ఒక వీడియో షేర్ చేసింది. కొన్నిసార్లు మనకు కావాల్సింది పక్కనే ఉంటుంది. కానీ మనం గుర్తించలేము. ప్రేమలు స్నేహంతోనే మొదలవుతాయి. మేము ఒకరినొకరం […]


Swara Bhaskar
Swara Bhaskar: పెళ్లితో కూడా కాంట్రవర్సీ రాజేసింది హీరోయిన్ స్వర భాస్కర్. సమాజ్ వాదీ పార్టీ నేత, సోషల్ యాక్టివిస్ట్ ఫహద్ జరార్ అహ్మద్ తో స్వర వివాహం వివాదాస్పదం అవుతుంది. జనవరి 6న స్వర భాస్కర్-ఫహద్ వివాహం జరిగింది. ఈ విషయాన్ని స్వర ఫిబ్రవరి 16న బయటపెట్టింది. తనకు వివాహం జరిగినట్లు ఒక వీడియో షేర్ చేసింది. కొన్నిసార్లు మనకు కావాల్సింది పక్కనే ఉంటుంది. కానీ మనం గుర్తించలేము. ప్రేమలు స్నేహంతోనే మొదలవుతాయి. మేము ఒకరినొకరం ఇష్టపడ్డాము. నా హృదయంలోకి స్వాగతం ఫహద్ అంటూ సందేశం పోస్ట్ చేశారు.
అయితే అన్నయ్యను వివాహం చూసుకున్నావా? అంటూ స్వర భాస్కర్ ని నెటిజెన్స్ ఏకిపారేస్తున్నారు. ఫహద్ ఆమెకు సొంత అన్నయ్య కాదు. స్వర భాస్కర్ కూడా సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఆ పార్టీలో చేరిన కొత్తలో ఫహద్ ని స్వర భాస్కర్ అన్నయ్య అని సంబోధించేవారు. ఫహద్ ని పబ్లిక్ లో స్వర అన్నయ్య అంటూ పిలిచిన వీడియోలు అనేకం ఉన్నాయి. అన్నయ్య అని పిలిచిన వ్యక్తిని ఎలా ప్రేమించావు? ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అని విమర్శల దాడి చేస్తున్నారు.
స్వర భాస్కర్ ది మతాంతర వివాహం కావడం కూడా వివాదాస్పదం అవుతుంది. ఇక స్వర జీవితంలో అనేక కాంట్రావర్సీలు ఉన్నాయి. వీరి ది వెడ్డింగ్ మూవీలో స్వర భాస్కర్ స్వయం సంతృప్తి పొందే సన్నివేశంలో నటించారు. అది తీవ్ర వివాదాస్పదమైంది. అలాంటి సన్నివేశంలో నటించడం ద్వారా స్వర భాస్కర్ విమర్శల పాలయ్యారు. 2018లో విడుదలైన వీరి ది వెడ్డింగ్ మూవీలో స్వర బోల్డ్ సన్నివేశాల్లో నటించారు. ఈ చిత్రంలో కరీనా కపూర్, సోనమ్ కపూర్ ప్రధాన పాత్రలు చేశారు.

Swara Bhaskar
ఢిల్లీకి చెందిన స్వర భాస్కర్ 2009లో బాలీవుడ్ లో అడుగుపెట్టారు. మధులాల్ కీప్ వాకింగ్ అనే చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్ చిత్రాల్లో నటన ఆమెకు ఫేమ్ తెచ్చింది. కొన్ని వెబ్ సిరీస్లు, మినీ సిరీస్లలో నటించారు. ప్రస్తుతం మిసెస్ ఫలని టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కుతుంది. నటిగా పెద్దగా ప్రభావం చూపలేకపోయిన స్వర భాస్కర్ వివాదాలతో ఫోకస్ లో ఉండేవారు.
