Talasani Sai Kiran Yadav: ఏపీ టూ తెలంగాణ.. గోదావరి దిశనే మార్చిన తలసాని తనయుడు!!
ఓ యూట్యూబ్ చానెల్‌కు తలసాని తనయుడు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో గోదావరి నదీ జలాలను ఎలా సద్వినియోగం చేసుకోబోతున్నారని యాంకర్ అడిగిన ప్రశ్నకు సాయి షాకింగ్ సమాధానం ఇచ్చారు.

Talasani Sai Kiran Yadav: నదులకు నడక నేర్పిన నేత కేసీఆర్ అని తెలంగాణ అధికార పార్టీ నేతలు తమ ముఖ్యమంత్రి గురించి భజన చేస్తుంటారు. ఎందుకంటే కాళేశ్వరం లిఫ్ట్ నిర్మాణంతో తెలంగాణ సస్యశ్యామలం అయిందిని, బీడు భూములు పచ్చగా మారుతున్నాయని చెబుతారు. అందులో కొంత నిజముంది. ఎందుకంటే.. గోదావరి నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా తిరిగి శ్రీరాంసాగర్‌కు ఎత్తిపోస్తున్నారు. అందుకే నదికి నడక నేర్పారంటున్నారనుకుందాం. కానీ అదే బీఆర్‌ఎస్‌కు చెందిన ఓ యువ నేత అయితే గోదావరికే దారి చూపుతున్నాడు. గోదావరి పుట్టుక, ప్రవహించే మార్గం.. గురించి ఆ యువనేత చెప్పిన భాష్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు గోదావరికే నడక నేర్పతున్న యువ నేత అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకీ ఆ యువనేత పేరు చెప్పలేదు కదూ.. ఆయన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తనయుడు తలసాని సాయి.
గోదావరి జీవనదట..
ఓ యూట్యూబ్ చానెల్‌కు తలసాని తనయుడు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో గోదావరి నదీ జలాలను ఎలా సద్వినియోగం చేసుకోబోతున్నారని యాంకర్ అడిగిన ప్రశ్నకు సాయి షాకింగ్ సమాధానం ఇచ్చారు. గోదావరి అనేది జీవనది అని ఎవరికీ తెలియని విషయం చెప్పానన్నట్లు గొప్పగా చెప్పారు. అంతే కాదు బేఆఫ్ బెంగాళ్‌లో కలుస్తుందట. ఈ సమాధానం విని యాంకర్ షాక్ అయ్యాడు.
ఏపీ నుంచి తెలంగాణలోకి ప్రవాహం..
మరో షాకింగ్ విజయం కూడా చెప్పారు సాయి.. అసలు గోదావరి ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహిస్తుందని ప్రశ్నించారు. దానికి సాయి.. గోదావరి ఏపీలో పుట్టి.. తెలంగాణలోకి వస్తుందట. ఈ సమాధానం విన్న యాంకర్‌కు నవ రంధ్రాల్లో నుంచి పొగలు వచ్చినంత పనైంది.
ఎక్స్‌ప్రెషన్స్ కేక..
ఇక సాయి ఇంటర్వ్యూలో తనకు తెలియని విషయాన్ని కూడా నిర్భయంగా మంచి ఎక్స్‌ప్రెషన్స్‌తో చెప్పడం గమనార్హం. తెలియకపోతే తెలియదని చెబుతారు. కానీ ఈ వర్ధమాన నాయకుడు మాత్రం తనకు తెలియన విషయాన్ని కూడా క్లారిటీగా చెప్పడం చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు.
ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..
ఇక ఈ ఇంటర్వ్యూ ఎప్పుడు ఇచ్చారో తెలియదు కానీ నెటిజన్స్ మాత్రం సాయిని ఓ ఆటాడుకుంటున్నారు. వచ్చాడండి కొత్త సోషల్ టీచర్.. కర్మరా బాబు ఇంకా నయం ఎంపీగా ఎన్నిక కాలేదు. ఆలుగడ్డలు.. ఆలుగడ్డలు.. అసలు ఇంటర్వ్యూలో ఇలాంటి గొట్టు ప్రశ్నలు అడగడం సరికాదండి.. వాడని ఎవరికైనా చూపించండ్రా.. ఎర్రగడ్డకు తీసుకుపోండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
