Manchu Lakshmi: ట్రోల్ ఆఫ్ ది డే: అమ్మ బాబోయ్ మంచు లక్ష్మి పాట పాడింది! పారిపోండ్రో!
Manchu Lakshmi: నడవడం రాని పిల్లాడు కారు నడపడం.. మంచు లక్ష్మి పాట పాడటం ఒకటే. రెండూ ప్రమాదమే. నిజానికి కవులు కూడా చేయని సేవ తెలుగు సాహిత్యానికి మంచు లక్ష్మి చేసింది.తన అమెరికన్ ఇంగ్లీష్ యాసకు తెలుగు భాష జోడించి సరికొత్త పదాలు కనిపెట్టింది. ‘నిలదీసిఫై’ అనే కొత్త తెలుగు పదం ఆమె కనిపెట్టిందే. తెలుగు నిఘంటువులు చేర్చాల్సి వుంది. నిపుణులు పరిశీలిస్తున్నారు. మంచు లక్ష్మి నోటి నుండి జాలువారిన ఇలాంటి ఆణిముత్యాలు చాలానే ఉన్నాయి. […]


Manchu Lakshmi
Manchu Lakshmi: నడవడం రాని పిల్లాడు కారు నడపడం.. మంచు లక్ష్మి పాట పాడటం ఒకటే. రెండూ ప్రమాదమే. నిజానికి కవులు కూడా చేయని సేవ తెలుగు సాహిత్యానికి మంచు లక్ష్మి చేసింది.తన అమెరికన్ ఇంగ్లీష్ యాసకు తెలుగు భాష జోడించి సరికొత్త పదాలు కనిపెట్టింది. ‘నిలదీసిఫై’ అనే కొత్త తెలుగు పదం ఆమె కనిపెట్టిందే. తెలుగు నిఘంటువులు చేర్చాల్సి వుంది. నిపుణులు పరిశీలిస్తున్నారు. మంచు లక్ష్మి నోటి నుండి జాలువారిన ఇలాంటి ఆణిముత్యాలు చాలానే ఉన్నాయి. వీడియోలు తవ్వుతూ పోతే బయటపడుతుంటాయి.
తెలుగు భాషను అలవోకగా రుచిలేని కిచిడీ చేయగల సత్తా మంచు లక్ష్మికి ఉంది. అలాంటి మంచు లక్ష్మి అచ్చ తెలుగు పదాలతో కూడిన పాట పాడితే ఇంకేమైనా ఉందా. శివరాత్రి శుభదినాన అదే జరిగింది. ఆ పరమశివుడిని స్తుతిస్తూ మంచు లక్ష్మి ఒక పాట పాడారు. పాడిందే తడవుగా తన పాట సోషల్ మాధ్యమాల్లో షేర్ చేశారు. హే సర్ప్రైజ్ నేను పాట పాడాను అంటూ కామెంట్ పోస్ట్ చేశారు.
ఇక పాటలో పదాలన్ని కలిపి చలిమిడి ముద్ద చేసింది. కొబ్బరి పలుకుల్లా, జీడీ పప్పుల్లా అక్కడక్కడా కొన్ని పదాలు చెవిన పడ్డాయి. పాట అని తెలుస్తుంది కానీ… ఆమె ఏం చెబుతున్నారో అర్థం కాలేదు. అందులోను అవి గ్రాంథిక తెలుగు పదాలు. మంచు లక్ష్మి నాకు ఇది రాదు కదా అనుకోదు. వచ్చిందేదో చేస్తా చూసి తరించండి అంటుంది. చేయడం నా ధర్మం చూడటం మీ ఖర్మం అంటుంది. 2014లో కూడా ఒక పాట పాడిందట. అప్పుడు తన కూతురు పుట్టిందట. మళ్ళీ పాట పాడింది కాబట్టి మరో బిడ్డను ఎక్స్ పెక్ట్ చేయొచ్చా అని ఫ్యాన్స్ అడుగుతున్నారు.

Manchu Lakshmi
సరోగసీనే కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు కనొచ్చు. సెలబ్రిటీలు ఈ మధ్య తమ గానంతో కూడా అభిమానులను అలరించాలనుకుంటున్నారు. బాలయ్య అయితే వేదిక దొరికితే మైక్ పట్టి గొంతు సవరించి పాటందుకుంటున్నారు. వీరసింహారెడ్డి ప్రమోషనల్ ఈవెంట్లో బాలయ్య ఓ సాంగ్ పాడారు. గతంలో పుట్టినరోజు కానుక అంటూ ప్రొఫెషనల్ సింగర్స్ కూడా పాడటానికి భయపడే ఘంటసాల పాడిన ‘శివశంకరీ’ సాంగ్ పాడి గుండెల్లో దడపుట్టించారు. బాలయ్యకు ఇప్పుడు మంచు వారమ్మాయి తోడైంది. ఆ పాటపై మీరు కూడా ఒక లుక్ వేయండి!
ప్రస్తుతం మంచు లక్ష్మి అగ్ని నక్షత్రం టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నారు. సొంత నిర్మాణ బ్యానర్ లో తెరకెక్కుతున్న అగ్ని నక్షత్రం చిత్రంలో మంచు లక్ష్మి ప్రధాన పాత్ర చేశారు. మరికొన్ని సినిమాలు సిరీస్లలో నటిస్తున్నట్లు మంచు లక్ష్మి ఇటీవల తెలియజేశారు.
View this post on Instagram
