ట్రైలర్‌ టాక్ : భారీ తారాగణం.. నవరసతో అదరహో

ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌ల ట్రెండ్ నడుస్తోంది. కాస్త వినూత్నమైన కంటెంట్ తో వస్తే ఆ సిరీస్ కి విశేష ఆదరణ లభిస్తుంది. అందుకే మేకర్స్ కూడా వెబ్ కంటెంట్ పై పడ్డారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ చూడని భారీ తారాగణంతో రానున్న ఆసక్తికర వెబ్‌సిరీస్‌ ‘నవరస’. గ్రేట్ విజువల్ డైరెక్టర్ మణిరత్నం సృష్టికర్తగా ఈ వెబ్‌ సిరీస్‌ రూపొందుతుండటం ఒక విశేషం అయితే, ఈ క్రేజీ సిరీస్ ను తొమ్మిది మంది దర్శకులు తెరకెక్కిస్తుండటం మరో విశేషం. […]

  • Written By: Raghava
  • Published On:
ట్రైలర్‌ టాక్ : భారీ తారాగణం.. నవరసతో అదరహో

Suriya Navarasaప్రస్తుతం వెబ్‌ సిరీస్‌ల ట్రెండ్ నడుస్తోంది. కాస్త వినూత్నమైన కంటెంట్ తో వస్తే ఆ సిరీస్ కి విశేష ఆదరణ లభిస్తుంది. అందుకే మేకర్స్ కూడా వెబ్ కంటెంట్ పై పడ్డారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ చూడని భారీ తారాగణంతో రానున్న ఆసక్తికర వెబ్‌సిరీస్‌ ‘నవరస’. గ్రేట్ విజువల్ డైరెక్టర్ మణిరత్నం సృష్టికర్తగా ఈ వెబ్‌ సిరీస్‌ రూపొందుతుండటం ఒక విశేషం అయితే, ఈ క్రేజీ సిరీస్ ను తొమ్మిది మంది దర్శకులు తెరకెక్కిస్తుండటం మరో విశేషం.

అయితే, తాజాగా ఈ వెబ్ సిరీస్‌ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా అన్ని రకాల భావోద్వేగాలతో పాటు భారీ తారాగణంతో ట్రైలర్ ఆద్యంతంగా ఆసక్తిగా సాగుతూ బాగా ఆకట్టుకుంది. తమ పాత్రల్లో నటీనటులు అందరు బాగా ఒదిగిపోయారు. పైగా లుక్స్‌ కూడా చాలా కొత్తగా వినూత్నగా ఉన్నాయి. ఇక నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది.

కాగా ఆగస్టు 6 నుంచి ప్రముఖ ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. సూర్య, సిద్ధార్థ్‌, ప్రకాశ్‌ రాజ్‌, విజయ్‌ సేతుపతి, రేవతి, ఐశ్వర్యరాజేశ్‌, అరవింద్‌ స్వామి, రోబో శంకర్‌, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సిరీస్ ను రతీంద్రన్‌ ఆర్‌. ప్రసాద్‌, అరవింద్‌ స్వామి, బిజోయ్‌ నంబియార్‌, గౌతమ్‌ వాసుదేవ మేనన్‌, సర్జున్‌ కె.ఎం, ప్రియదర్శన్‌, కార్తీక్‌ నరేన్‌, కార్తీక్‌ సుబ్బరాజ్‌, వసంత్‌ ఇలా తొమ్మిది మంది దర్శకులు తొమ్మిది పార్ట్స్ గా ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు.

అయితే ఈ భారీ మల్టీస్టారర్ సిరీస్‌కి ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం మరో దర్శకుడు జయేంద్రతో కలిసి ఈ సిరీస్ ను నిర్మిస్తుండటంతో ఈ సిరీస్ పై భారీ అంచనాలు ఉన్నాయి. తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన సినీ కార్మికులని ఆదుకోవడమే లక్ష్యంగా ఈ సిరీస్‌ రూపుదిద్దుకుంది.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు