Nellore Pedda Reddy Chepala Pulusu: స్టార్ హీరోయిన్ తో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు షాప్ ఓపెనింగ్.. కిరాక్ ఆర్పీ వ్యాపారం మూడు పూలు ఆరు కాయలు!
కొద్దినెలల్లో మణికొండలో మరో బ్రాంచ్ ఏర్పాటు చేశాడు. నాగబాబు అతిథిగా హాజరై షాప్ ఓపెన్ చేశాడు. తాజాగా కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి బ్రాండ్ తిరుపతిలో పెట్టాడు.

Nellore Pedda Reddy Chepala Pulusu: ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ వ్యాపారిగా మారిన విషయం తెలిసిందే. అతడు రూ. 40 లక్షలు పెట్టుబడి పెట్టి కూకట్ పల్లి ఏరియాలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో కర్రీ పాయింట్ ఓపెన్ చేశాడు. హైదరాబాద్ శివారులో వంటశాల ఏర్పాటు చేసి అక్కడ వండించిన చేపల పులుసు కూకట్ పల్లి వద్ద షాప్ లో అమ్మడం స్టార్ట్ చేశాడు. ఈ వ్యాపారానికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. కొత్తగా మరింత స్టాఫ్ ని సమకూర్చుకుని వ్యాపారం పెద్దది చేశాడు. తన పెట్టుబడి నెలరోజుల్లోపే వచ్చేసిందట.
కొద్దినెలల్లో మణికొండలో మరో బ్రాంచ్ ఏర్పాటు చేశాడు. నాగబాబు అతిథిగా హాజరై షాప్ ఓపెన్ చేశాడు. తాజాగా కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి బ్రాండ్ తిరుపతిలో పెట్టాడు. ఈ షాప్ ఓపెనింగ్ కి ఏకంగా హీరోయిన్ ని పిలిచాడు. ఎఫ్ 2 ఫేమ్ మెహ్రీన్ హాజరైంది. అలాగే మంత్రి రోజాను కూడా మర్యాదపూర్వకంగా ఆహ్వానించాడు. తిరుపతిలో తారల సందడి మధ్య నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బ్రాండ్ ఓపెన్ అయ్యింది. ఇది తెలుగు స్టేట్స్ లో హాట్ టాపిక్ అయ్యింది.
తిరుపతిలో కూడా వ్యాపారం సక్సెస్ అయితే ఏపీలో పలు చోట్ల కిరాక్ ఆర్పీ తన వ్యాపారం విస్తరించే అవకాశం ఉంది. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు షాప్ లో ధరలు కొంచెం అధికంగానే ఉంటాయని సమాచారం. జనాలకు టేస్ట్ నచ్చడంతో ఎగబడి కొంటున్నారు. నెల్లూరుకు చెందిన వంటవాళ్లు కిరాక్ ఆర్పీ వద్ద పని చేస్తున్నారని సమాచారం.
జబర్దస్త్ కి సాధారణ కమెడియన్ గా వచ్చాడు కిరాక్ ఆర్పీ. తన కామెడీ మేనరిజం, నెల్లూరు యాసతో ఫేమస్ అయ్యాడు. దాంతో టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు. నాగబాబు జబర్దస్త్ ని వీడిన నేపథ్యంలో కిరాక్ ఆర్పీ కూడా బయటకు వచ్చేశాడు. అనంతరం డైరెక్టర్ గా ప్రయత్నం చేశాడు. ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. జబర్దస్త్ నుండి బయటకు వచ్చాక మల్లెమాల సంస్థ మీద కిరాక్ ఆర్పీ ఆరోపణలు చేశాడు. శ్రమ దోచుకోవడమే కానీ సరైన ఫుడ్ పెట్టరు. డబ్బులు తక్కువ ఇస్తారని ఫైర్ అయ్యాడు.
