
Neem Tree Benefits
Neem Tree Benefits: అనాదిగా మనం చెట్లను పూజించడం వాటితో తయారయ్యే వాటిని తీసుకుని ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం అలవాటే. ఈ నేపథ్యంలో వేప చెట్టను మనం ఇంట్లో పెంచుకోవడం మంచిదే. దాని నుంచి వెలువడే స్వచ్ఛమైన గాలి కూడా ఎంతో హాయిని ఇస్తుంది. వేసవి కాలంలో అయితే దాని కింద పడుకుంటే మంచి నిద్ర పట్టడం ఖాయమే. వేల సంవత్సరాలుగా మన ఆరోగ్యానికి వేప పెద్ద దిక్కుగా ఉంటోంది. ఆయుర్వేదంలో వేపకు ఎంతో ప్రాధాన్యం ఉంది. వేప గురించి చరక సంహిత, సిద్ధవైద్యంలోనూ ప్రస్తావించారు. వేప చెట్టు నాలుగు శతాబ్ధాలుగా దీనిలోని ఔషధ గుణాలను ఉపయోగించుకుంటున్నారు.
సింధూ నాగరికతలోనే వేప అవశేషాలు ఉన్నట్లు ఆనవాళ్లు బయటపడ్డాయి. కొబ్బరిచెట్టును కల్పవృక్షం అంటుంటారు కానీ వేపచెట్టు కల్పవృక్షంగా భావించాలి. వేపచెట్టు పచ్చదనంతో ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. వేపలోని ప్రతిది మనకు పనికొస్తుంది. వేప ఆకులు, కర్రలు, కాయలు, పండ్లు అన్ని కూడా మనకు ఉపయోగపడతాయి. ఆరోగ్యం అందించడంలో వాటి పాత్ర ఎంతో ఉంది. వేప శాస్త్రీయ నామం అజాడిరక్టా ఇండికా అని పిలుస్తారు. సంస్కృతంల నింబ అని సంబోధిస్తారు. వేప ఆకులు వాడినా వాటితో లాభమే. భూమిలో అవి ఇమిడిపోతే బలం కలుగుతుంది. ఇలా వేపతో ఎన్నో లాభాలున్నాయి.

Neem Tree Benefits
ఆఫ్రికా భాషల దీన్ని మ్వారోబైని అని అంటారు. ఆ పదానికి నలభై చెట్టు అని అర్థం. నలభై వ్యాధుల్ని నయం చేస్తుందని చెబుతారు. 1992లో వాషింగ్టన్ లోని నేషనల్ ఎకాడెమీస్ ప్రెస్ ప్రచురించిన నీమ్ ఎ ట్రీ ఫర్ సాల్వింగ్ గ్లోబల్ ప్రాబ్లమ్స్ లాంటి పుస్తకాలు వరల్డ్ నీమ్ ఆర్గనైజేషన్, నీమ్ ఫౌండేషన్ లాంటి సంస్థలు దీని ప్రాధాన్యం గురించి తెలిపాయి. వేపలో ఎన్నో రకాల సహజసిద్ధమైన గుణాలు ఉండటం వల్ల వేపను ఆయుర్వేదంలో ఎంతో ఉన్నతంగా చూస్తారు. దీని ప్రతి భాగం మనకు మందుల్లో వాడేందుకు ఉపయోగపడతాయి.
మన పూర్వీకులు వేప పుల్లలను పళ్లు తోముకోవడానికి ఉపయోగించేవారు. దీంతో ఎన్ని ఏళ్లయినా వారికి దంత సమస్యలు వచ్చేవి కావు. ఇప్పుడు మనం పేస్టులంటూ అలవాట్లు మార్చుకోవడంతో మన పళ్లు పుచ్చిపోతున్నాయి. దంత సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఇప్పటికి టూత్ పేస్టులు వాడేది 49 శాతం మందే కావడం గమనార్హం. వేపాకుల్లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ హైపర్ గ్లైసెమిక్, యాంటీ అల్సర్, యాంటీ మలేరియల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మ్యుటాజెనిక్, యాంటీ కార్సినోజేనిక్ లక్షణాలు ఉంటాయి. పిల్లలకు చికెన్ ఫాక్స్, మీజిల్స్ లాంటి జ్వరాలు సోకినప్పుడు పక్క మీద వేపాకు పరుస్తారు.
వేప చెట్టు బెరడును కషాయంగా తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. చర్మవ్యాధులు తొలగిపోతాయి. బెరడు, ఆకులను కొబ్బరి నూనెలో వేసి వేడి చేసి నీటిని కలిపి మరిగించి తలకు పట్టిస్తే చుండ్రు సమస్య పోతుంది. చెంచాడు వేపాకు రసానికి అర చెంచా తేనె కలిపితే నులిపురుగులను నివారించవచ్చు. పుండ్లు, మచ్చలు, కుష్టు వ్యాధి లాంటి వాటికి కూడా ఇది చక్కని ఔషధం. అతిమూత్ర వ్యాధి, మధుమేహం లాంటి వాటికి కూడా వేప మందులా పనిచేస్తుంది. అందుకే వేపను దివ్య ఔషధంగా భావించడం సహజమే.