Nayanthara : భర్త కెరీర్ కోసం నయనతార పడుతున్న కష్టాలను చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు
Nayanthara సౌత్ ఇండియా లో లేడీ సూపర్ స్టార్ అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే మొట్టమొదటి పేరు నయనతార.ప్రతీ ఏడాది ఎంత మంది హీరోయిన్లు ఇండస్ట్రీ కి వచ్చినా, ఇసుమంత ఇమేజి కూడా తగ్గని ఏకైక స్టార్ హీరోయిన్ ఆమె, అందుకే ఇప్పటికీ కూడా సూపర్ స్టార్స్ సరసన హీరోయిన్ గా నటిస్తూ మరో పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది.ప్రస్తుతం ఈమె ఒక్కో సినిమాకి పది కోట్ల రూపాయలకు […]

Nayanthara సౌత్ ఇండియా లో లేడీ సూపర్ స్టార్ అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే మొట్టమొదటి పేరు నయనతార.ప్రతీ ఏడాది ఎంత మంది హీరోయిన్లు ఇండస్ట్రీ కి వచ్చినా, ఇసుమంత ఇమేజి కూడా తగ్గని ఏకైక స్టార్ హీరోయిన్ ఆమె, అందుకే ఇప్పటికీ కూడా సూపర్ స్టార్స్ సరసన హీరోయిన్ గా నటిస్తూ మరో పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది.ప్రస్తుతం ఈమె ఒక్కో సినిమాకి పది కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ని తీసుకుంటుందట.
ఇది కేవలం సౌత్ లోనే కాదు,ఇండియాలోనే ఆల్ టైం హైయెస్ట్ అని చెప్పొచ్చు.అంత డిమాండ్ చేస్తున్నా కూడా నిర్మాతలు ఆమెకి అవకాశాలు ఇవ్వడానికి ఏమాత్రం వెనకడుగు వెయ్యడం లేదు,అది నయనతార రేంజ్.ఈమధ్యనే ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు సతీష్ విగ్నేష్ ని పెళ్లాడిన నయనతార, సరోగసి పద్దతి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మని ఇచ్చింది.
సాధారణంగా హీరోయిన్స్ కి పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత సినిమాల్లో అవకాశాలు బాగా తగ్గిపోతాయి.కానీ నయనతారకి మాత్రం క్రేజ్ పెరిగిపోయింది, కెరీర్ పరంగా నయనతార కి మరో పదేళ్లు ఎలాంటి ధోఖా లేదు, కానీ భర్త విగ్నేష్ కెరీర్ మాత్రం బాగా పడిపోయింది.కానీ ఆయన కెరీర్ ని చక్కబెట్టే పనిని నయనతార తీసుకుంది.అలా ఆమె ఏకంగా తమిళనాడు సూపర్ స్టార్స్ లో ఒకరైన తల అజిత్ తో ఒక సినిమా చేసే అవకాశం ని ఇప్పించింది.కానీ ఫైనల్ న్యారేషన్ లో అజిత్ కి స్క్రిప్ట్ నచ్చకపోవడం తో రిజెక్ట్ చేసాడు.దీనితో నయనతార ఇప్పుడు విజయ్ సేతుపతి తో సతీష్ విగ్నేష్ కి ఒక సినిమా చేసి పెట్టేలా చేస్తుంది.
కెరీర్ లో ఊపిరి సలపనంతా బిజీ గా గడుపుతున్న విజయ్ సేతుపతి ని ఒప్పించింది.త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుంది.కేవలం విజయ్ సేతుపతి తో మాత్రమే కాదు, శివ కార్తికేయన్ , తలపతి విజయ్ వంటి స్టార్ హీరోలతో కూడా తన భర్త కి సినిమాలు డైరెక్ట్ చేసే అవకాశం ని కల్పిస్తుంది నయనతార.ఇలాంటి భార్య దొరికినందుకు నిజంగా సతీష్ విగ్నేష్ అదృష్టవంతుడు అనే చెప్పాలి.
