Nayanthara- Vignesh Shivan: పుట్టిన రోజు సందర్బంగా విగ్నేష్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన నయనతార
పెళ్లిన నాలుగు నెలలకే సరోగసి ద్వారా పిల్లలను కనడమే కొందరికి నచ్చలేదు. అంటే పెళ్లికి ముందే వీరు సరోగసి విధానం ఎంచుకున్నారా? అనే ప్రశ్నలు కూడా తలెత్తాయి.

Nayanthara- Vignesh Shivan: కోలీవుడ్ డైరెక్టర్ గా ఎన్నో హిట్ లను తన ఖాతాలో వేసుకున్నారు విగ్నేష్ శివన్. కానీ తెలుగు ప్రేక్షకులకు నయనతార భర్తగానే సుపరిచితం ఈ డైరెక్టర్. కొంత కాలంగా ప్రేమలో ఉండి ఆ తర్వాత పెళ్లి ద్వారా ఒకటయ్యారు ఈజంట. నయనతార, విగ్నేష్ శివన్ జోడీగా కూడా మంచి మార్కులు సంపాదించారు. గతంలో సరోగసి ద్వారా పిల్లలను కని కోర్టు వరకు వెళ్లింది ఈ జంట. సెప్టెంబర్ 18న విగ్నేష్ పుట్టిన రోజు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. వారు సెలబ్రేట్ చేసుకున్న విధానాన్ని ఫోటోల రూపంలో బందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నయన్. ఈ ఫోటోలే ఇప్పుడు తెగ్ వైరల్ అవుతున్నాయి.
పెళ్లిన నాలుగు నెలలకే సరోగసి ద్వారా పిల్లలను కనడమే కొందరికి నచ్చలేదు. అంటే పెళ్లికి ముందే వీరు సరోగసి విధానం ఎంచుకున్నారా? అనే ప్రశ్నలు కూడా తలెత్తాయి. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ జంట తమ సంతానంతో చాలా సంతోషంగతా ఉన్నారు. ఇక విగ్నేష్ అయితే పిల్లల పోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అయితే నయనతార తన భర్తకు స్పెషల్ గా విషెష్ తెలిపింది.
తను తెలపడం మాత్రమే కాదు తన పిల్లలతో బర్త్ డే శుభాకాంక్షలు తెలిపుతూ ఫోటోను పోస్ట్ చేసింది నయన్. ఇక హ్యాపీ బర్త్ డే అప్ప అంటూ తన పిల్లలు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు ఈమె అన్ని అరేంజ్మెంట్ చేశారు. అంతేకాదు రెండు కేకులు తెప్పించి కట్ చేయించిందట నయన్.
పిల్లలు పుట్టిన తర్వాత ఇదే తన మొదటి పుట్టిన రోజంటూ.. తను మాత్రమే కాకుండా తన పిల్లలతో కూడా శుభాకాంక్షలు తెలిపేలా చేసిన నయన్ కు థాంక్స్ అంటూ ఆనందం వ్యక్తం చేశారు విగ్నేష్. అయితే వీరు పోస్ట్ చేసిన ఫోటోలు అందరూ ఒకే రకమైన బట్టలు ధరించారు. ఈ ఫోటో ఫుల్ అట్రాక్ట్ గా నిలుస్తుంది. ఇక ఈ జంట ఇప్పుడు మాత్రమే కాదు ఎన్నో సార్లు ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ తమ ప్రేమను వ్యక్త పరుస్తుంటారు. రీసెంట్ గా నయనతార జవాన్ సినిమాతో మెప్పించింది. ఈ సినిమా రిలీజ్ కు ముందు షారుఖ్ ఖాన్, విగ్నేష్ ఇద్దరు కూడా నయనతార గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించిన విషయం తెలిసిందే.
View this post on Instagram
