Nayanthara And Vignesh Shivan: ఉయిర్, ఉలగ్ లను పరిచయం చేసిన నయన్, విఘ్నేష్
విఘ్నేష్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. అయితే వారి ముఖాలను చూపించకుండా జాగ్రత్త పడుతున్నారు. కృష్ణాష్టమి సందర్భంగా వారిద్దరి కుమారులను ప్రత్యేకంగా ముస్తాబు చేసి కృష్ణుడికి పూజలు చేస్తున్నట్టు ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Nayanthara And Vignesh Shivan: నయన్..విఘ్నేష్.. సుదీర్ఘకాలం ప్రేమించుకున్న ఈ జంట. కొంతకాలం క్రితం ఒకటయ్యారు. పెళ్లికి ముందే సరోగసీ ద్వారా పిల్లల్ని కనాలని ప్రణాళిక రూపొందించుకున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. వాళ్ళకు ఉయిర్, ఉలగ్ అని నామకరణం చేశారు. ఇక అప్పటినుంచి వారిని బయటి ప్రపంచానికి చూపించడం లేదు.. పెళ్లి తర్వాత విఘ్నేష్.. నయనతార, విజయ్ సేతుపతి, సమంత కాంబినేషన్లో కాద వాక్కుల కాదల్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక నయనతార పెళ్లి తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించింది. షారుక్ ఖాన్ జవాన్ సినిమాలో నయనతార నటించింది.. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. నయనతార, విఘ్నేష్ ఎవరు కెరియర్లలో వాళ్లు బిజీగా ఉన్నారు.
అయితే ఇటీవల తమ కుమారులకు సంబంధించి సోషల్ మీడియాలో నయనతార,
విఘ్నేష్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. అయితే వారి ముఖాలను చూపించకుండా జాగ్రత్త పడుతున్నారు. కృష్ణాష్టమి సందర్భంగా వారిద్దరి కుమారులను ప్రత్యేకంగా ముస్తాబు చేసి కృష్ణుడికి పూజలు చేస్తున్నట్టు ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విఘ్నేష్ జన్మదినం సందర్భంగా ఇద్దరు కుమారుడు శుభాకాంక్షలు చెబుతున్న ఫోటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వినాయక చవితి సందర్భంగా నయనతార తన ఇద్దరు కుమారులను ఎత్తుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తున్న ఒక చిన్న వీడియోను సోషల్ మీడియాలో వదిలారు. అయితే ఆ పిల్లల ముఖాలు సరిగా కనిపించకుండా ఇద్దరికీ కళ్ళద్దాలు ధరింపజేశారు.
ఇక తమ కుమారులను తమ అభిమానులకు చూపించాలని ఉద్దేశంతో బుధవారం సోషల్ మీడియాలో.. నయనతార, విఘ్నేష్ ఫోటోలను పోస్ట్ చేశారు. ఇందులో వారిద్దరి కుమారులకు ప్రత్యేకమైన దుస్తులు ధరించి నయనతార, విఘ్నేష్ ఫోటోషూట్ లో మెరిశారు. ఆ పిల్లలిద్దరూ అచ్చం విఘ్నేష్ లాగానే ఉన్నారు. నయనతార నుదుటిమీద విఘ్నేష్ ఒక ముద్దు పెడుతుండగా.. ఇద్దరు తమ చేతుల్లో పిల్లలను పట్టుకొని ఫోటోలు దిగారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. వారిద్దరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారిద్దరికీ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
