Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతారకు కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధలు తప్పలేదట. తనకు కూడా అది అనుభవమైందని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. నయనతార కెరీర్ బుల్లితెరపై మొదలైంది. చదువుకునే రోజుల్లోనే నయనతార మోడలింగ్ చేశారు. హీరోయిన్ గా ఎదగాలనేది ఆమె కల. 2003లో ఆమె సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. మనస్సినక్కారే అనే మలయాళ చిత్రంలో నటించారు. ఆమెకు చంద్రముఖి బ్రేక్ ఇచ్చింది. ఏకముగా రజినీకాంత్ తో జతకట్టే ఛాన్స్ దక్కించుకుంది. చంద్రముఖి బ్లాక్ బస్టర్ హిట్ కాగా నయనతార పేరు ప్రేక్షకుల్లో రిజిస్టర్ అయ్యింది.

Nayanthara
గజినీ మూవీలో సెకండ్ హీరోయిన్ రోల్ చేశారు. లక్ష్మీ మూవీతో తెలుగులో అడుగుపెట్టారు. దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన లక్ష్మి వెంకీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దాంతో ఆమెకు వరుస ఆఫర్స్ వచ్చాయి. ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి స్టార్స్ తో జతకట్టే ఛాన్స్ దక్కించుకుంది. నాగార్జున, చిరంజీవి, బాలయ్య వంటి సీనియర్ స్టార్ పక్కన కూడా నటించారు. అంచెలంచెలుగా తన ఇమేజ్ పెంచుకుంటూ లేడీ సూపర్ స్టార్ గా అవతరించారు. సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగారు.
అయితే నయనతారకు కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధలు తప్పలేదట. ఓ దర్శకుడు హీరోయిన్ ఆఫర్ ఇస్తా, పక్కలోకి వస్తావా? అని అడిగాడట. దీంతో నయనతార నాకు ఇష్టం లేదు. ఈ ఆఫర్ నాకొద్దని అక్కడ నుండి వెళ్లిపోయారట. పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్నమాట వాస్తవమే. అయితే మన నిర్ణయం మీదే అది ఆధారపడి ఉంటుంది. అలాంటి విషయాలకు దూరంగా ఉండాలి. తెలివిగా మసలుకోవాలని చెప్పుకొచ్చారు. క్యాస్టింగ్ కౌచ్ ఉన్నప్పటికీ మన ఇష్టం లేకుండా ఏదీ జరగదని ఆమె పరోక్షంగా చెప్పారు .

Nayanthara
కాగా గత ఏడాది నయనతార వివాహ బంధంలో అడుగుపెట్టారు. దర్శకుడు విగ్నేష్ శివన్ తో ఏడడుగులు వేశారు. 2015 నుండి నయనతార-విగ్నేష్ ప్రేమించుకుంటున్నారు. చాలా కాలంగా డేటింగ్ లో ఉన్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లిపీటలు ఎక్కారు. అంతే కాకుండా నెలల వ్యవధిలో కలల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. సరోగసీ పద్దతిలో నయనతార దంపతులు కవల మగపిల్లలకు పేరెంట్స్ అయ్యారు. ఇది వివాదాస్పదమైంది. తమిళనాడు ప్రభుత్వం వారి మీద విచారణ జరిపింది. సరోగసీ చట్టంలో ఉన్న అన్ని నిబంధనలు పాటించినట్లు ఆధారాలు సమర్పించారు. ఆ విధంగా వివాదం నుండి బయటపడ్డారు.