గుడ్ న్యూస్ చెప్పిన నయనతార..

దక్షిణాదిన లేడి సూపర్ స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న నయనతార నిర్మాతలకు, అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. కెరీర్ తొలినాళ్లలో నయనతార గ్లామర్ పాత్రలు చేస్తూ అభిమానులను అలరించించింది. అయితే గత కొంతకాలంగా నయనతార పెళ్లి, ప్రేమ వ్యవహారాలు అనే టాపిక్ రావడంతో ఆమె గ్లామర్ షో తగ్గించింది. బికీనీలు, పొట్టి డ్రెస్సులకు దూరంగా ఉంటూ సంప్రదాయ పాత్రల్లో, లేడి ఓరియెంటెడ్ పాత్రల్లోనే కనిపించిది. అయితే తాజాగా నయనతార నిర్మాతలకు బంపర్ ఆఫ్ ఇచ్చిందని తెలుస్తోంది. స్క్రిప్ట్ […]

  • Written By: Neelambaram
  • Published On:
గుడ్ న్యూస్ చెప్పిన నయనతార..

దక్షిణాదిన లేడి సూపర్ స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న నయనతార నిర్మాతలకు, అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. కెరీర్ తొలినాళ్లలో నయనతార గ్లామర్ పాత్రలు చేస్తూ అభిమానులను అలరించించింది. అయితే గత కొంతకాలంగా నయనతార పెళ్లి, ప్రేమ వ్యవహారాలు అనే టాపిక్ రావడంతో ఆమె గ్లామర్ షో తగ్గించింది. బికీనీలు, పొట్టి డ్రెస్సులకు దూరంగా ఉంటూ సంప్రదాయ పాత్రల్లో, లేడి ఓరియెంటెడ్ పాత్రల్లోనే కనిపించిది. అయితే తాజాగా నయనతార నిర్మాతలకు బంపర్ ఆఫ్ ఇచ్చిందని తెలుస్తోంది. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ముద్దు సన్నివేశాల్లో నటించడంతోపాటు బికినీ వేసేందుకు కూడా రెడీ అని చెప్పినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సౌత్ ఇండియాలో నెంబర్ వన్ హీరోయిన్ గా నయనతార కొనసాగుతోంది. ఆమె నటించిన సినిమాలన్నీ బంపర్ హిట్టుగా నిలుస్తున్నాయి. దీంతో ఆమెను బుక్ చేసుకునేందుకు నిర్మాతలు ఎగబడుతుంటారు. అయితే నయనతార సినిమా ప్రమోషన్లలో పాల్గొనకపోవడంతో ఆమెపై చాలా రుమర్లు వస్తుంటాయి. గత కొద్దిరోజులుగా నిర్మాతలు కూడా ఈ విషయంలో ఆమెపై గుస్సగా ఉంటున్నారు. దీంతో ఆమెకు వరుసగా ఆఫర్లు తగ్గుతూ వస్తున్నాయి. అంతేకాకుండా గత కొద్దిరోజులుగా నయనతార గ్లామర్ షోను తగ్గించి కేవలం నటపరమైన సినిమాలకే ప్రాధాన్యమిస్తూ సినిమాలను చేస్తున్నారు.

తాజాగా నయనతార గ్లామర్ షోకు ఒకే చెప్పడంతో నిర్మాతలతోపాటు ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు. గత కొన్నాళ్లుగా నటనపరమైన సినిమాలే చేసిన నయనతారను మళ్లీ గ్లామరస్ గా చూడాలని కుర్రకారు ఉవ్విళ్లిరుతున్నారు. ఇన్నాళ్లు చీరలు, చీడిదార్లతో అలరించిన నయన్ ఇక బికీనీలు, పొట్టి దుస్తులతో అలరించబోతుంది. ఆఫర్లు తగ్గుతున్నాయని గమనించిన నయన్ ఇలా నిర్మాతలకు ఆఫర్ ప్రకటించిన మళ్లీ సినిమాలను లైన్లో పెడుతూ తన క్రేజ్ తగ్గకుండా చూసుకుంటుంది. ఎంతైనా నయనతార నయా నిర్ణయం ఆమెకు బాగా కలిసొచ్చేలా కన్పిస్తుంది.

సంబంధిత వార్తలు