RRR Oscor : కోట్లాది మంది ఇండియన్ సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ లిస్ట్ ఈరోజు బయటకి వచ్చేసింది.. ఎన్నడూ లేనిది మన ఇండియన్ ప్రేక్షకులు ఇంతలా హాలీవుడ్ అవార్డ్స్ కోసం ఎదురు చూడడానికి కారణం #RRR సినిమాకి ఆస్కార్స్ లో నామినేషన్స్ కి వెళ్తుంది అనే ప్రచారం జరగడం వల్లే.. అందరూ అనుకుంటున్నట్టే ఆస్కార్స్ లో #RRR సినిమాకి చోటు దక్కింది.. ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన ‘నాటు నాటు’ సాంగ్ బెస్ట్ ‘ఒరిజినల్ సాంగ్’ క్యాటగిరీలో నామినేషన్ ని దక్కించుకుంది.
ఇటీవలే ఈ పాటకి ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు దక్కిన సంగతి మన అందరికీ తెలిసిందే.. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ అవార్డుని అందుకున్నాడు.. ఇప్పుడు అదే పాట ఆస్కార్స్ కి నామినేట్ అవ్వడం ప్రతీ ఇండియన్ ఎంతో గర్వించదగ్గ విషయం.. కచ్చితంగా ఈ కేటగిరీలో నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు దక్కుతుందని అంటున్నారు విశ్లేషకులు..
ఇంకా ఆర్ఆర్ఆర్ చిత్రం పలు క్యాటగిరీలలో నామినేషన్స్ దక్కించుకునే అవకాశం ఉందని.. ఉత్తమ ఫారిన్ చిత్రంగా #RRR నామినేట్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.. చూడాలి మరి.