Site icon OkTelugu

ఢిల్లీలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఢిల్లీలోని కీర్తినగర్‌ మెట్రో స్టేషన్‌ వద్ద ఆదివారం అర్ధరాత్రి నిలిపి ఉన్న ట్రాక్టర్‌ను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో రాజేశ్‌ శర్మ, తరుణ్‌ గుప్తా, చరన్‌దీప్‌ సింగ్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి పర్వీన్‌సింగ్‌ తీవ్రంగా గాయపడగా అతనని మోతినగర్‌లోని ఎబిజి ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులంగా పాండవనగర్‌ వాసులని తెలిపారు. మృతుల్లో ముగ్గరు చిన్నానాటి స్నేహితులని పోలీసులు తెలిపారు.

Exit mobile version