Site icon OkTelugu

ఫ్యాక్టరీలో సిలిండర్‌ పేలిముగ్గురు మృతి..

బొమ్మల తయారీ ఫ్యాక్టరీలో పేలుడు జరిగిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌ ఢిల్లీగేట్‌ ప్రాంతంలోని బొమ్మల తయారీ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు సిలిండర్‌ పేలింది.దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడమే మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి ప్రాణాలు విడాచారు. ఇంకో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని జవహర్‌లాల్‌ నెహ్రూ మెడికల్‌ కాలేజి ఆసుపత్రికి తరలించారు. సిలిండర్‌ పెద్ద ఎత్తున పేలడంతో భవనం కుప్ప కూలింది. దీంతో పరిసరాల్లోకి కొన్ని ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.

Exit mobile version