Site icon OkTelugu

వ్యాక్సిన్ పంపిణీకి కార్యాచరణ రూపొందిస్తున్నాం: మోదీ

దేశ్ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కార్యాచరణ రూపొందిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్ నిల్వల కోసం కోల్డ్ స్టోరేజ్ లను రాష్ట్రప్రభుత్వాలే ఏర్పాటు చేసుకోవాలని ఆయన తెలిపారు. సూక్ష్మ స్థాయిలో వ్యాక్సిన్ పంపిణీ ఎలా చేపడుతారో ప్రణాళికలను పంపించాలని సీఎంలను కోరారు.ప్రస్తుతం టీకా అభివ్రుద్ధి జరుగుతున్నా ఎన్ని డోసులు ఉంటాయో తెలియవని చెప్పలేమన్నారు. కరోనా వ్యాక్సిన్ ధరను కూడా ఇంకా నిర్ణయించలేదన్నారు. కానీ వ్యాక్సిన్ ను విడుదల చేసేందకు మాత్రం కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు.

Exit mobile version