Chandrayaan 3- CM Jagan: నాసాకు ఇస్రోకు తేడా తెలియదు: చంద్రయాన్-3 రాకెట్ పంపింది మన జగనన్నే
శుక్రవారం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో చంద్రయాన్-3 ప్రయోగం నిర్వహించారు. అది విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. చంద్రయాన్-2 ప్రయోగం విఫలం తర్వాత శాస్త్రవేత్తలు లార్జర్ దెన్ లైఫ్ అనేలాగా దీని మీద బాగా ఎఫర్ట్ పెట్టారు. అమెరికా, చైనా, రష్యా తర్వాత ఆ స్థాయిలో భారీ ప్రయోగం చేశారు. దీనికోసం బాహుబలి లాంటి రాకెట్ సిద్ధం చేశారు. మొత్తానికి అనుకున్నది సాధించారు.

Chandrayaan 3- CM Jagan: దున్నపోతు ఈనిందిరా అంటే దొడ్లొ కట్టేయ్ పాలు పితుకుదాం అన్నాడట వెనుకటికి ఒకడు. అలానే ఉంది వైసీపీ నాయకుల తీరూ తెన్నూ. పంచుడు పథకాలతో సన్ రైజ్ స్టేట్‌ను కాస్త అప్పుల కుప్పగా మార్చారు. బటన్ నొక్కుడు, ప్రభుత్వ పథకాల్లో నొక్కుడుకు భారీగా తెరదీశారు. ఇక ఆ ప్రచార యావ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత తక్కువ మంచింది. శ్మశానం నుంచి శౌచాలయం వరకు ప్రతీదానికి తమ పార్టీ రంగులే వేస్తున్నారు. ఇదేంట్రా అని ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు, కేసులు, మన్నూమశానం. చివరికి వారి ప్రచార పిచ్చి ఎంత దాకా వెళ్లింది అటే ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 ఘనత కూడా వారి నాయకుడు జగన్ చలవే అనే స్థాయికి విస్తరించింది.
మెదడు అరికాళ్లలోకి జారినట్టుంది
శుక్రవారం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో చంద్రయాన్-3 ప్రయోగం నిర్వహించారు. అది విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. చంద్రయాన్-2 ప్రయోగం విఫలం తర్వాత శాస్త్రవేత్తలు లార్జర్ దెన్ లైఫ్ అనేలాగా దీని మీద బాగా ఎఫర్ట్ పెట్టారు. అమెరికా, చైనా, రష్యా తర్వాత ఆ స్థాయిలో భారీ ప్రయోగం చేశారు. దీనికోసం బాహుబలి లాంటి రాకెట్ సిద్ధం చేశారు. మొత్తానికి అనుకున్నది సాధించారు. ఫలితంగా దేశం మొత్తం పండగ చేసుకుంటోంది. సోషల్ మీడియా మొత్తం ఊగిపోతోంది. ఇలాంటప్పుడు ఈ దేశం లో పుట్టి న వాడేవడైనా ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు చెబుతారు. కాసింత కళాపోషణ ఉంటే సోషల్ మీడియాలో ఇస్రో చేసిన పనిని కీర్తిస్తూ నాలుగు మాటలు రాస్తారు. కానీ, ఇదేం పోయే కాలమో గాని ఏపీలోని వైసీపీ నాయకులకు మెదడు అరికాళ్లలోకి జారినట్టుంది.
తేడా తెలియదా?
మనదేశంలో అంతరిక్ష ప్రయోగాలు ఇస్రో చేస్తుంది. దాని ప్రయోగ కేంద్రం ఒకటి శ్రీహరి కోటలో ఉంది. ఇది ఏపీకి గర్వకారణం. సగటు ఆంఽధ్రావాలాకు కూడా గర్వకారణమే. ఇందులో జగన్ గొప్పతనమేముంది? ఏ అంతరిక్ష ప్రయోగం విజయవంతమైనా ఇస్రో చైర్మన్ పదవిలో ఉన్న వ్యక్తి ఇది సమష్టి కృషి అని కితాబిస్తాడు. ప్రయోగం తర్వాత తన చాంబర్‌కు పిలిచి విందు ఇస్తాడు. అంతటి ప్రధాని కూడా ఓ అతిథి లాగానే అక్కడికి వస్తాడు. వీలయితే వారిని అభినందిస్తూ నాలుగు మాటలు మాట్లాడతాడు. అది దేశ ప్రధానిగా అతడి బాధ్యత. కానీ ఈ సంస్కారం వైసీపీ వాళ్లకు ఎందుకు లేకుండా పోయింది? చంద్రయాన్-3ని ప్రయోగించింది ఇస్రో అయితే నాసా ఎక్కడి నుంచి వచ్చింది? మధ్యలో జగన్ ప్రస్తావన ఎందుకు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫొటో ఎందుకు? ఇదేమైనా ప్రభుత్వ కార్యక్రమమా? బటన్ నొక్కే పథకమా? చూస్తుంటే చంబల్ లోయ టిట్లా వారసుల్లా ఉన్నారే!
