Hyderabad Accident: స్నేహితుడి కోరిక.. 120 కి.మీల వేగం..నార్సింగ్ కారు ప్రమాద ఘటనలో విస్తుపోయే వాస్తవాలు..!
హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు మహమ్మద్ బదియుద్దీన్ ఖాద్రీ తన స్నేహితుడు బానోత్ గణేష్ చెప్పడం వల్లే కారును వేగంగా నడిపినట్లు పోలీసులకు వెల్లడించాడు. డ్రైవింగ్ లైసెన్స్ లేదని చెప్పినా మహమ్మద్ బదియుద్దీన్ ఖాద్రీకు.. అబ్దుల్ రెహమాన్ వాహనం ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది.

Hyderabad Accident: రోడ్డు ప్రమాదాలు కొన్నిసార్లు ఎక్కువగా తప్పుడు సలహాలు వల్ల జరుగుతుంటాయి. ముఖ్యంగా కార్లపై, బైకులపై నెమ్మదిగా వెళ్లాలని చాలామందికి ఉన్న.. స్నేహితులు చెప్పే మాటలు వల్ల అనేక మంది పరిధికి మించి వేగంగా ప్రయాణాలు చేసి ప్రాణాలు మీదకు తెచ్చుకుంటారు. హైదరాబాదు పరిధి నార్సింగ్ లో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గల కారణం వెనుక స్నేహితుడి తప్పుడు సలహా ఉన్నట్లు అర్థమవుతుంది. తెల్లవారుజామున రోడ్డు మీద ట్రాఫిక్ లేదు కాబట్టి.. కారు వేగంగా వెళితేనే మజా ఉంటుందని స్నేహితుడు చెప్పాడని, గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లి ప్రమాదానికి కారణమయ్యారు యువకులు. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు చనిపోయిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు మహమ్మద్ బదియుద్దీన్ ఖాద్రీ తన స్నేహితుడు బానోత్ గణేష్ చెప్పడం వల్లే కారును వేగంగా నడిపినట్లు పోలీసులకు వెల్లడించాడు. డ్రైవింగ్ లైసెన్స్ లేదని చెప్పినా మహమ్మద్ బదియుద్దీన్ ఖాద్రీకు.. అబ్దుల్ రెహమాన్ వాహనం ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. డ్రైవింగ్ పక్క సీట్లో బానోత్ గణేష్, వెనుక సీట్లో మహమ్మద్ ఫయాజ్, ఇబ్రహీముద్దీన్ కూర్చున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరు చనిపోయారని తెలుసుకున్న తరువాత నలుగురూ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించి సీసీ కెమెరాల్లో రికార్డయిన పుటేజీని చూస్తే కారు అత్యంత వేగంగా వస్తూ వాకింగ్ కి వెళ్తున్న ముగ్గురుని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత చెందారు. మరొకరు చికిత్స పొందుతున్నారు.
