Naresh Pavitra Lokesh: ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ నటుడు నరేశ్.. తాజాగా నాలుగో పెళ్లికి రెడీ అయ్యారు. అందమైన నటి పవిత్రా లోకేష్ తో సహజీవనం చేస్తూ మరో పెళ్లికి సమాయత్తమవుతున్నాయి. అయితే ఈయన మూడో భార్య అయిన రమ్య రఘుపతి ఇప్పుడు నరేష్ పై ప్రతీకారం తీర్చుకుంటోందట..తనతో విడాకులు కాకుండానే ‘పవిత్రా’ మోజులో పడి తనను వదిలిపెట్టాడని.. మా బంధం విడిపోవడానికి ఆమెనే కారణమని ఆరోపిస్తోందట..
బెంగళూరులో న్యూస్ చానెల్స్ కు ఎక్కి నరేష్ పై రచ్చ చేస్తోంది.యూట్యూబ్ చానెల్స్ లో నరేష్ పరువు తీస్తోంది. దీంతో దెబ్బకు సీనియర్ నటుడు నరేష్ బయటకు వచ్చాడు. తన మూడో భార్య బాగోతాలన్నీ బయటపెట్టేశాడు.
రమ్య రఘుపతి ఏరోజూ తనకు భార్యలా ప్రవర్తించలేదని.. తన దగ్గర పనిచేసే డ్రైవర్ తో ఎఫైర్ పెట్టుకుందని నరేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఓ సారి ఇంట్లో ఫంక్షన్ ఏర్పాటు చేస్తే ‘మేల్ క్యాబరే డ్యాన్సర్ ను తీసుకొచ్చిందని’ తెలిపాడు. ఇదేంటని మందలిస్తే చెత్త వివరణలు ఇచ్చిందని తెలిపాడు. పరిస్థితి చేయిదాటిపోయిందని గ్రహించి ఆమెను దూరంగా పెట్టానని.. విడాకుల నోటీసు పంపించానని తెలిపారు.
రమ్య రఘుపతికి నెల కిందటే విడాకుల నోటీసులు పంపానని నరేశ్ తెలిపారు. డ్రైవర్ తో ఎఫైర్ పెట్టుకోవడమే కాదు.. ఆమె 8 ఏళ్లుగా దందాలు చేస్తూ తనను వేధిస్తోందని.. టాలీవుడ్ లో.. ఇంటా బయటా బాగా అప్పులు చేసి ఎగ్గొట్టిందని.. చివరకు తాను కూడా రూ.10లక్షలు ఇచ్చానని నరేశ్ వాపోయారు. ఇక్కడ కేసులు కావడంతోపాటు ఎఫ్ఐఆర్ నమోదైందని.. అందుకే ఆమెకు విడాకులు ఇచ్చేశానని నరేశ్ తెలిపారు.
ఇప్పుడు మకాంను బెంగలూరుకు మార్చి హిందూపురం సహా బెంగళూరులోనే ఇదే దందా చేస్తోందని.. అక్కడ తన గురించి, పవిత్ర లోకేష్ తో తన బంధం గురించి ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తోందని నరేశ్ పేర్కొన్నాడు. విడాకుల నోటీసు పంపాక ‘పవిత్ర లోకేష్ వల్లే’ తనకు విడాకులు ఇస్తున్నాడని.. నాకు పెళ్లి కాబోతోందంటూ పుకార్లు పుట్టిస్తోందని నరేశ్ ఒక వీడియోను విడుదల చేశారు.
తప్పు చేసిన రమ్య భయపడాలని.. చేతకాకపోతే భయపడాలని.. పవిత్రా కూడా మాట్లాడుతుందని.. మా అందరి బాధను అర్థం చేసుకొని సపోర్ట్ చేయాలని నరేశ్ మీడియాకు విజ్ఞప్తి చేశారు. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.