HBD Nara Lokesh: టీడీపీ భావినేత నారా లోకేశ్ కరోనా నేపథ్యంలో క్వారంటైన్‌లో ఉన్నారు. కానీ, ఆదివారం ఆయన జన్మదిన వేడుకలను టీడీపీ కార్యకర్తలు ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ ఉత్సాహం గతంలో లోకేశ్ మంత్రిగా ఉన్నప్పుడు కూడా లేదని ఈ సందర్భంగా కొందరు అభిప్రాయపడుతున్నారు. మంత్రిగా ఉన్నపుడు లోకేశ్..పార్టీ కార్యకలాపాలకు కొంత దూరంగా ఉన్నారని, కానీ, ఇప్పుడు కంప్లీట్ టైం పార్టీ కోసమే పని చేస్తున్నారని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

HBD Nara Lokesh
అలా నారా లోకేశ్ మొత్తంగా కార్యకర్తల నేతగా ఎదిగారనే అభిప్రాయం కూడా ఉంది. పార్టీ కార్యకర్తలతో నేరుగా సంబంధాలు పెట్టుకుని పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేశ్ పార్టీ కోసం కష్టపడుతున్నారు. జనంలోకి విస్తృతంగా వెళ్తుండటమే కాదు..పార్టీ కార్యకర్తలకు భరోసా కూడా ఇస్తున్నారు.
Also Read: పెట్రోల్ డబ్బా తెచ్చుకుందాం.. తేల్చుకుందాం.. మంత్రి కొడాలి నానికి బొండా ఉమ సవాల్..
నిజానికి టీడీపీ ప్రస్తుతం అధికారంలో లేదు. అయినప్పటికీ నారా లోకేశ్ బర్త్ డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. టీడీపీలో లోకేశ్ బర్త్ డే సందర్భంగా నూతన ఉత్సాహం, ఉత్తేజం కనబడుతున్నది. ఇకపోతే గతంలో క్లీన్ షేవ్ తో ఉండే నారా లోకేశ్ ప్రజెంట్.. గడ్డం పెంచి తన వాయిస్ లో బేస్ కూడా పెంచాడు. ఇకపోతే ఇటీవల కాలంలో లోకేశ్ కొంత మౌనం అయితే పాటిస్తున్నారు. అలా లోకేశ్ కొద్ది రోజుల పాటు మౌన ముద్ర దాల్చడం వ్యూహాత్మకమేననే అభిప్రాయం కూడా కొందరిలో వ్యక్తమవుతున్నది. టీడీపీ వర్గాలు కూడా గతంతో పోల్చితే ఇప్పుడు నారా లోకేశ్ ను లీడర్ గా అంగీకరిస్తున్నాయి. పార్టీని తనదైన స్థాయిలో ముందుకు తీసుకు వెళ్లగలిగే సత్తా నారా లోకేశ్ కు ఉందనే అభిప్రాయం టీడీపీ వర్గాల్లో మెల్లమెల్లగా ఏర్పడుతున్నది. ఈ సందర్భంగా టీడీపీ భావినేతగా లోకేశ్ అయ్యే చాన్సెస్ కూడా ఉంటాయని కొందరు పేర్కొంటున్నారు.
తాను సీఎం అయ్యేకే ఏపీ అసెంబ్లీలో అడుగు పెడతానని ఇటీవల ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు శపథం చేసిన సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే ఏపీ పాలిటిక్స్ బాగా హీటెక్కాయి. రాజకీయ క్షేత్రంలో అప్పుడే ప్రచార పర్వం షురూ అయిందన్న మాదిరిగా పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలోనే తండ్రి చంద్రబాబుకు మద్దతుగా తనయుడు లోకేశ్ ఏ మేరకు పని చేస్తాడనేది వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తేలనుంది.
Also Read: తగ్గేదేలే… క్యాసినో పాలిటిక్స్ తో హీటెక్కిన గుడివాడ.. టీడీపీ వర్సెస్ వైసీపీ