Chandrababu – Tollywood : నారా చంద్రబాబు అరెస్ట్… నిర్మాత సురేష్ బాబు సెన్సేషనల్ కామెంట్స్
ర్మాత సురేష్ బాబు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో దగ్గుబాటి రామానాయుడు బాపట్ల ఎంపీగా టీడీపీ పార్టీ తరపున గెలిచారు. వెంకటేష్, సురేష్ బాబు టీడీపీ పార్టీకి ప్రచారం చేయడం విశేషం. ఇక టీడీపీని అభిమానించే ఓ బలమైన సామాజిక వర్గం చిత్ర పరిశ్రమలో ఉంది.

Chandrababu – Tollywood : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై చిత్ర పరిశ్రమ స్పందించాలంటూ ఇటీవల నిర్మాత నట్టి కుమార్ అభిప్రాయ పడ్డారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ ని నిరసించాలి. చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి ప్రముఖులు దీనిపై మాట్లాడాలని అన్నారు. నిర్మాత అశ్వినీ దత్, కే రాఘవేంద్రరావు మినహాయిస్తే చంద్రబాబు నాయుడుకి మద్దతుగా మాట్లాడినవారు లేరు. తాజాగా సీనియర్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు పొలిటికల్ విషయాల్లో చిత్ర పరిశ్రమ తలచూర్చడం సరికాదని అభిప్రాయపడ్డారు.
‘సప్త సాగరాలు దాటి’ అనే చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న సురేష్ బాబును ఓ విలేకరి… నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై మీ అభిప్రాయం ఏమిటని అడిగారు. దానికి ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమ నాన్ పొలిటికల్, నాన్ రెలిజియస్ అనే నియమానికి కట్టుబడి ఉంది. తెలుగు పరిశ్రమ చెన్నైలో ఉన్నప్పుడు హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాక కూడా ఇదే పాటిస్తున్నాం. తెలంగాణ/ఆంధ్రా ఉద్యమాల సమయంలో కూడా పరిశ్రమ మౌనం వహించింది.
చంద్రబాబు నాయుడు అరెస్ట్ సెన్సిటివ్ ఇష్యూ. ఒక లీడర్ అంటే మనకు ఇష్టం ఉండొచ్చు. ఉండకపోవచ్చు. బహిరంగంగా పొలిటికల్ కామెంట్స్ చేయడం సరికాదు. చిత్ర పరిశ్రమకు రాజకీయాలతో సంబంధం లేదు. చంద్రబాబుతో పాటు అనేక మంది ముఖ్యమంత్రులు చిత్ర పరిశ్రమకు మేలు చేశారు. మా నాన్న(రామానాయుడు) నేను కూడా టీడీపీకి పని చేశాము. అది మా పర్సనల్. కానీ చిత్ర పరిశ్రమ తరపున పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వమని ఆయన అన్నారు.
నిర్మాత సురేష్ బాబు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో దగ్గుబాటి రామానాయుడు బాపట్ల ఎంపీగా టీడీపీ పార్టీ తరపున గెలిచారు. వెంకటేష్, సురేష్ బాబు టీడీపీ పార్టీకి ప్రచారం చేయడం విశేషం. ఇక టీడీపీని అభిమానించే ఓ బలమైన సామాజిక వర్గం చిత్ర పరిశ్రమలో ఉంది. అయితే మెజారిటీ పరిశ్రమ పెద్దల అభిప్రాయం మేరకు వాళ్ళు దీనిపై మౌనం వహించారు. టీడీపీలో సుదీర్ఘంగా పని చేసిన మురళీ మోహన్ చంద్రబాబు అరెస్ట్ ని ఖండించకపోవడం కొసమెరుపు.
