Tollywood: గత రెండేళ్లు కరోనా కారణంగా సినిమాలు థియేటర్లో విడుదల కాలేదు. షూటింగ్ కూడా ఆగిపోయాయని చెప్పుకోవాలి. దీంతో ఈ ఏడాది లోనే చాలా సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఇది చిత్రపరిశ్రమకు ఒక పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే స్టార్ హీరోలు సైతం తమ చిత్రాలను పూర్తి చేసిన… సినిమాలు విడుదల చేయడానికి సరైన డేట్స్ సెట్ కాక చిత్రాలను వాయిదా వేస్తున్నారు.
అందులో భాగంగా బోయపాటి – బాలయ్య కాంబినేషన్ లో అఖండ అనే మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. విడుదలకు సరైన క్లారిటీ లేకా వాయిదా పడుతుంది. ఇటీవలే భారీ బడ్జెట్తో నిర్మించిన చిత్రాలు విడుదలకు డేట్ ఖరారు చేసుకున్నవి.
వచ్చే ఏడాది జనవరిలో ఆర్ఆర్ఆర్,రాధేశ్యామ్ విడుదల కావడంతో కలెక్షన్ సమస్యలు ఏర్పడతాయని చాలా చిత్రాలు తమ డేట్స్ ను వాయిదా వేసుకున్నాయి.
అయితే బోయపాటి అందుతున్న సమాచారం ప్రకారం “అఖండ” చిత్రాన్ని క్రిస్మస్ పండగ సందర్భంగా డిసెంబర్ 24న విడుదల చేయాలి అనే ఆలోచనలో ఉన్నారట. అదే సమయానికి నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారట. అల్లు అర్జున్ నటించిన పుష్ప డిసెంబర్ 17న విడుదల కానుంది . ఇప్పుడు బాలయ్యకు పోటీగా నాని తన సినిమా శ్యామ్ సింగరాయ్ సినిమా విడుదల చేస్తారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. చూడాలి మరి నాని … బాలయ్య కు పోటీగా వెళ్తారా లేదా, తన సినిమాని వాయిదా వేస్తారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.